హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Muslim Girl Marriage: మైనర్ అయినా ముస్లిం బాలిక పెళ్లి చేసుకోవచ్చు.. హర్యానా హైకోర్టు సంచలన తీర్పు

Muslim Girl Marriage: మైనర్ అయినా ముస్లిం బాలిక పెళ్లి చేసుకోవచ్చు.. హర్యానా హైకోర్టు సంచలన తీర్పు

పంజాబ్ - హర్యానా హైకోర్టు (ఫైల్)

పంజాబ్ - హర్యానా హైకోర్టు (ఫైల్)

Muslim Girl Marriage: ఇస్లామిక్ చట్టం ప్రకారం, మైనర్ ముస్లిం బాలిక తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఆర్టికల్ 195 ప్రకారం వారికి ఈ వెసులుబాటు ఉందని గుర్తు చేసింది.

  • News18
  • Last Updated :

భారత్ లో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం అబ్బాయిలు 21, అమ్మాయిలు18 సంవత్సరాలు వయస్సు వచ్చాకే పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ మైనర్లకు పెళ్లి చేస్తే దాన్ని బాల్య వివాహ చట్టం కింద నేరంగా పరిగణిస్తారు. అయితే, ముస్లిం అమ్మాయిలు రసజ్వల అయితే చాలు మైనర్ అయినా సరే వివాహం చేసుకోవచ్చని పంజాబ్–హర్యానా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం, మైనర్ ముస్లిం బాలిక తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఆర్టికల్ 195 ప్రకారం వారికి ఈ వెసులుబాటు ఉందని గుర్తు చేసింది.

పునరుత్పత్తి దశకు రాని మైనర్లు తమ గార్డియన్ల ద్వారా వివాహ బంధంలోకి అడుగుపెట్టవచ్చని, యుక్త వయసు మైనర్లు మాత్రం తమ గార్డియన్ అనుమతి ఉన్నా లేకపోయినా తమ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చని ఆ ఆర్టికల్లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. పంజాబ్కు చెందిన ఓ ముస్లిం జంట వేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ అల్కా సరిన్ ఈ మేరకు వివాదాస్పద తీర్పును వెలువరించారు.

37 ఏళ్ల వ్యక్తి, 17 ఏళ్ల మైనర్ బాలిక ఇష్టపూర్వకంగా గత నెల 21న పెళ్లి చేసుకున్నారు. అయితే మా పెళ్లి ఇష్టం లేని కుటుంబ సభ్యులు తమను బెదిరిస్తున్నారని, కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఈ జంట హైకోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఈ జంట వారి వాదనలు వినిపిస్తూ..‘‘ముస్లిం చట్టంలో పేర్కొన్న యుక్తవయస్సు, మెజారిటీ రెండూ ఒకటేనని, 15 సంవత్సరాల వయస్సులో ఒక వ్యక్తి మెజారిటీ సాధిస్తాడని, మెజారిటీ పొందిన ఒక వ్యక్తి గార్డియన్ ఇష్టం ఉన్నా లేకపోయినా తాను ఇష్టప్రకారం వివాహ చేసుకోవచ్చు.” అని వాదించారు. వారి వాదనలు విన్న న్యాయమూర్తి ‘‘అమ్మాయి మైనర్ అయినప్పటికీ, ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ వివాహం చెల్లుతుందని తీర్పు వెలువరించింది. అంతేకాక, వారి పెళ్లిని దృవీకరిస్తూ సర్ దిన్షా ఫర్దుంజీ ముల్లా రాసిన ‘ప్రిన్సిపల్స్ ఆఫ్ మొహమ్మదాన్ లా’ పుస్తకంలోని ఆర్టికల్ 195 ను ప్రస్తావించింది.’’

ఆర్టికల్ 195 ప్రకారం వివాహం వారి చెల్లుతుంది..

ముల్లా రాసిన పుస్తకం నుండి తీసుకోబడిన ఆర్టికల్195 ప్రకారం,“యుక్తవయస్సు పొందిన అమ్మాయిలు వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే వివాహ బంధంలోకి అడుగు పెట్టవచ్చు. అదేవిధంగా యుక్తవయస్సు రాని, మతిస్థిమితం లేని మైనర్ల విషయంలో మాత్రం వారి సంరక్షకుల అనుమతి మేరకు వివాహ బంధంలోకి అడుగు పెట్టవచ్చు.”అని స్పష్టం చేసింది. కాగా, పిటిషన్ దాఖలు చేసిన ఈ జంట వారి కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్నందున, వారి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా వెంటనే వారికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

First published:

Tags: Haryana, High Court, Marriage, Muslim Minorities, Punjab

ఉత్తమ కథలు