హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఇండియా అంటే ఇదే : హిందూ స్వామిజీని ఇంటికి ఆహ్వానించి పాదపూజ చేసిన ముస్లిం దంపతులు

ఇండియా అంటే ఇదే : హిందూ స్వామిజీని ఇంటికి ఆహ్వానించి పాదపూజ చేసిన ముస్లిం దంపతులు

స్వామీజీకి పాదపూజ చేసిన ముస్లిం దంపతులు(Image Source :

స్వామీజీకి పాదపూజ చేసిన ముస్లిం దంపతులు(Image Source :

Muslim couple padapooja to hindu seer : కర్ణాటక(Karnataka)లో హిందూ-ముస్లింల(Hindu-Muslim) మధ్య ప్రతీకారాలు, హత్యలు వంటి సంఘటనల సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Muslim couple padapooja to hindu seer : కర్ణాటక(Karnataka)లో హిందూ-ముస్లింల(Hindu-Muslim) మధ్య ప్రతీకారాలు, హత్యలు వంటి సంఘటనల సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒక ముస్లిం కుటుంబం శుక్రవారం స్వరూపానంద స్వామీజీని ఆహ్వానించి 'పాదపూజ(Padapooja)' నిర్వహించారు. స్వామీజీ పాదాలకు పూజలు చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించారు ముస్లిం దంపతులు.

గదగ్ నగరంలోని హడ్కో కాలనీలో నివాసముంటున్న సికందర్ బడేఖాన్.. రిటైర్డ్ ప్రొఫెసర్. తాజాగా సికందర్ బడేఖాన్ దంపతులు ధార్వాడ్ జిల్లా కైరాకొప్పలోని ఓంకార్ ఆశ్రమానికి చెందిన స్వరూపానంద స్వామిని తమ ఇంటికి ఆహ్వానించారు. గదగ్ జిల్లాలో అనేక ముస్లిం కుటుంబాలు స్వరూపానంద స్వామి అనుచరులవడం గమనార్హం. ఉత్తర కర్ణాటకలోని ఈ ప్రాంతం మత సహనం, సోదరభావానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చాలా గ్రామాలలో హిందువులు-ముస్లింలు ఒకరికొకరుగా ప్రేమగా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా ఏళ్లుగా స్వరూపానంద స్వామీజీని సికందర్ బడేఖాన్ తన ఇంటికి ఆహ్వానిస్తున్నాడు. తాజాగా స్వరూపానంద స్వామిని ఇంటికి ఆహ్వానించిన సికందర్ బడేఖాన్ దంపతులు..స్వామిజీకి పాదపూజ చేశారు. ఆ తర్వాత ఇంట్లో ‘ఓం నమః శివాయ’మంత్రాన్ని జపించారు. తర్వాత స్వామీజీ సికిందర్ ఇంట్లో ‘ప్రసాదం’(భోజనం) తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

Priest Convert To Islam : ఇస్లాం మతంలోకి మారిన ఆలయ పూజారి..అయితే కొన్ని గంటలకే..

మొహర్రం సమయంలో కూడా సద్భావన కనిపిస్తుంది

ఉత్తర కర్ణాటకలోని బెలగావి జిల్లా సౌందట్టి తాలూకాలోని హిరేబిదాన్‌పూర్ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేకపోవడంతో స్థానిక నాయకులు ముహర్రం వేడుకలను ఆచారంగా జరుపుకున్నారు. ముస్లిం కుటుంబం లేని కారణంగా, హిందువులు చాలా సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రకమైన సామరస్య సంప్రదాయం జిల్లాలోని అనేక గ్రామాల్లో పాటిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ రకమైన పని మత సామరస్యం యొక్క రూపంగా కనిపిస్తుంది.

మరోవైపు, కర్ణాటకలోని బేలూర్ లోని చారిత్రాత్మక చెన్నకేశ్వర రథయాత్ర ప్రారంభించే ముందు ఖురాన్ పఠిస్తారు. దీన్ని కూడా ఓ వర్గం వ్యతిరేకించింది. సమాజంలో ఐక్యత సందేశాన్ని అందించడానికి ముస్లిం కుటుంబాలకు, హిందూ సాధువులకు ప్రజలు ఉత్సాహంగా మద్దతు ఇస్తారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Karnataka, Muslim Minorities

ఉత్తమ కథలు