హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Hindu Culture: ముస్లిం జంటకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి.. నిఖా అయిన 18 ఏళ్లకు మళ్లీ వివాహం..

Hindu Culture: ముస్లిం జంటకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి.. నిఖా అయిన 18 ఏళ్లకు మళ్లీ వివాహం..

Hindu Culture: ముస్లిం జంటకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి.. నిఖా అయిన 18 ఏళ్లకు మళ్లీ వివాహం..

Hindu Culture: ముస్లిం జంటకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి.. నిఖా అయిన 18 ఏళ్లకు మళ్లీ వివాహం..

Hindu Culture: భారత సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు విదేశీయులు ఆసక్తి చూపిస్తుంటారు. మన దేశ ఆధ్యాత్మిక పద్ధతులకు చాలామంది ఆకర్షితులు అవుతుంటారు. ఇలాంటి ఆసక్తితో భారత పర్యటనకు వచ్చిన అమెరికన్ ముస్లిం జంట.. ఏకంగా హిందూ సంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

భారత సంస్కృతి (Indian Culture), సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు విదేశీయులు ఆసక్తి చూపిస్తుంటారు. మన దేశ ఆధ్యాత్మిక పద్ధతులకు చాలామంది ఆకర్షితులు అవుతుంటారు. ఇలాంటి ఆసక్తితో భారత పర్యటన (India Tour)కు వచ్చిన అమెరికన్ ముస్లిం జంట.. ఏకంగా హిందూ సంప్రదాయం (Hindu Rituals) ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంలో వీరి పెళ్లి జరిగింది.

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ముస్లిం దంపతులు (American-origin Muslim couple) కియామహ్ దిన్ ఖలిఫా, ఖేష ఇటీవల ఇండియా టూర్‌కు వచ్చారు. ఈ క్రమంలో వారు ఉత్తరప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రం వారణాసిని సందర్శించారు. ఇక్కడి ఘాట్‌లన్నీ దర్శించుకున్న తర్వాత హిందూ సంస్కృతి, సంప్రదాయల గురించి వివరంగా తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అలాగే ఆచార, వ్యవహారాల గొప్పతనం తెలుసుకుని వాటిపైన అమితమైన గౌరవం, ప్రేమ ఏర్పరుచుకున్నారు. ఈ నేపథ్యంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

* గతంలోనే నిఖా

కియామహ్, ఖేష జంటకు 18ఏళ్ల కిందటే ముస్లిం పద్ధతుల ప్రకారం నిఖా జరిగింది. తాజాగా హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ త్రిలోచన్ మహదేవ్ ఆలయంలో శనివారం వీరి పెళ్లి జరిగింది. పూజారి హిందూ వివాహ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిపించారు.

దంపతుల వయసు ప్రస్తుతం 40 ఏళ్లకు పైగానే ఉందని, ముస్లిం సంప్రదాయం ప్రకారం 18 ఏళ్ల కిందటే వారి పెళ్లి జరిగిందని పూజారి రవి శంకర్ గిరి తెలిపారు. ఈ దంపతులకు 9 మంది పిల్లలున్నారని, త్రిలోచన్ మహాదేవ్ ఆలయంలో హిందూ వివాహ పద్ధతి ప్రకారం అగ్ని సాక్షిగా భార్యా భర్తలు ఏడు ప్రదక్షిణలు చేశారని పూజారి పేర్కొన్నారు. హిందూ వైవాహిక పద్ధతి ప్రకారం తమ పెళ్లి జరిగాలన్న దంపతుల కల నెరవేరిందని పూజారి ఈ సందర్భంగా తెలిపారు.

ఇది కూడా చదవండి : వామ్మో.. చివరలో షాకింగ్ ఘటన.. కొబ్బరి చెట్టుపై నుంచి దిగుతున్న చిరుత.. వైరల్ మారిన వీడియో...

* పూర్వీకులు భారతీయులే..

హిందూ వివాహ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకోవడం పట్ల ముస్లిం దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన తాత భారత సంతతికి చెందిన హిందువని కియామహ్ దిన్ ఖలిఫా భార్య ఖేష ఖలిఫా చెప్పారు. ఈ పెళ్లికి స్థానికంగా ఉండే పూజారులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. పెళ్లి రోజున దంపతులకు పాస్ పోర్ట్, వీసా లేవు. కాగా, ఆ తర్వాత వీరు సంబంధిత డాక్యుమెంట్లు తీసుకొచ్చారు. అలా వీరి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించగా, వీరికి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను కూడా అందించారు.

హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నందుకు తమకు సంతోషంగా ఉందని దంపతులు చెప్పుకొచ్చారు. విదేశానికి చెందిన వారు అందులో పరమతస్తులు అయిన వారు హిందూ సంప్రదాయం(Hindu culture) ప్రకారం హిందూ ఆలయంలో పెళ్లి చేసుకోవడం ద్వారా హిందూ సంస్కృతి, పద్ధతులపైన వారికి ఎంతటి నమ్మకం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చని పలువురు చెబుతున్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Marriage, Trending news, Uttar pradesh, VIRAL NEWS, Wedding

ఉత్తమ కథలు