Home /News /national /

MUMBAIS FIRST HEART TRANSPLANT PATIENT TO GET MARRIED AFTER SIX YEARS OF SURGERY GH SK

Mumbai Patient: ఆరేళ్ల క్రిత గుండె మార్పిడి.. జీవితమే తలకిందులు.. ఇప్పుడు అంతా హ్యాపీ.. త్వరలో పెళ్లి

అన్వర్ ఖాన్

అన్వర్ ఖాన్

Anwar khan marriage: ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్ అన్వర్ ఈ నెలాఖరులో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పుట్టుకతో వచ్చిన హృదయం పాడైతే.. దాన్ని తొలగించి ఆ స్థానంలో దాతల గుండెను అమరుస్తారు వైద్యులు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ (Heart Transplant) లేదా గుండె మార్పిడి ఆపరేషన్లు భారతదేశంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్లు పరిమితంగానే జరుగుతుంటాయి కానీ విదేశాల్లో మాత్రం ఇవి సాధారణం. వాస్తవానికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్లలో చాలామంది ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తుంటారు. కానీ కొందరిలో అపోహలుంటాయి. గుండెకు ఆపరేషన్ అయితే ఎక్కువ కాలం జీవించలేరని కొందరు భావిస్తారు.ఐతే అందులో నిజంలేదని,  హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్లు ఎక్కువకాలం జీవించగలరనే విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరముందని అంటున్నాడు ముంబై నివాసి అన్వర్ ఖాన్.

ఆరేళ్ల క్రితమే ముంబయిలో తొలిసారిగా సక్సెస్ ఫుల్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్న వ్యక్తి ఈ అన్వర్ ఖాన్ (Anwar Khan). ఇంత కాలంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్ అన్వర్ ఈ నెలాఖరులో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్వర్ తమకు దక్కడని అప్పట్లో క్రుంగిపోయిన తల్లిదండ్రులు ఇప్పుడు తన కొడుకుకి పెళ్లి జరగబోతోందని అమితానందంతో క్షణాలను గడుపుతున్నారు.

Chennai Floods: చెన్నై మునిగిపోతుందా? వామ్మో.. ఏంటా  వర్షాలు

బద్లాపూర్ నివాసి అన్వర్ ఖాన్ (28)కు పుట్టుకతో వచ్చిన గుండె ఘోరంగా దెబ్బతింది. ఈ క్రమంలో ఆగస్టు 3, 2015న అతని పరిస్థితి విషమంగా మారింది. అదే రోజున బ్రెయిన్ డెడ్ అయిన మహిళ (42) గుండెను దానం చేయడానికి ఆమె కుటుంబం అంగీకరించింది. వెంటనే ముంబయి వైద్యులు అన్వర్ కు పునర్జీవం పోశారు. నగరంలోనే తొలి సక్సెస్ ఫుల్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్ గా అన్వర్ చరిత్ర సృష్టించాడు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ జరిగాక ఒక ఏడాది పాటు అన్వర్ బయటకు అడుగు పెట్టలేదు. అతను కోలుకునేంత వరకు తన కుటుంబం లీజుకు తీసుకున్న రెండవ ఫ్లాట్‌లో ఉండవలసి వచ్చింది. ట్రాన్స్‌ప్లాంట్ సమయంలో అన్వర్‌కు తన మొదటి ప్రియురాలు బాగా సపోర్ట్ చేసింది.
దురదృష్టవశాత్తూ ఆమె తన కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అన్వర్ కుటుంబ సభ్యులు ఓ అమ్మాయి కోసం వెతకడం ప్రారంభించారు. కానీ ట్రాన్స్‌ప్లాంట్ గురించి విన్న అనేక కుటుంబాలు అన్వర్‌కు తమ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేందుకు ససేమిరా అన్నారు.

మారనున్న భారత కరెన్సీ రూపం.. కొత్త నాణేలు ఎలా ఉంటాయో తెలుసా?

అయితే ఎట్టకేలకు అన్వర్‌ ను పెళ్లి చేసుకునేందుకు షాజియా అనే యువతి ముందుకొచ్చింది. ఆమె తల్లిదండ్రులు అతన్ని కలుసుకుని గంటల కొద్దీ విచారణ చేసి.. ఆ తర్వాతే తమ కూతురినిచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించారు. తాను పని చేస్తున్నప్పుడు షాజియా కుటుంబ సభ్యులు తనను, తన తండ్రిని కలిశారని తెలిపాడు. వ్యాయామశాలలో వర్కవుట్‌లు చేయడం చూసి తన ఫిట్‌నెస్, ఆరోగ్యం గురించి తాజా కుటుంబ సభ్యులు తెలుసుకున్నారని వెల్లడించాడు.

ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే, దేశవిదేశాల్లోని టాప్​ 15 కాలేజీలు

ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అన్వర్ ఐటీ పరిశ్రమలో ఉద్యోగం చేయాలని భావిస్తున్నాడు. నవంబర్ 30న, అన్వర్ తన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అన్వయ్ ములాయ్‌తో సహా మొత్తం ట్రాన్స్‌ప్లాంట్ టీమ్ పెళ్లికి హాజరు కావాలని.. తనని, షాజియాని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అన్వర్ అన్నయ్య షోబ్ కూడా అదే రోజు పెళ్లి చేసుకుంటుండటం విశేషం. అన్వర్ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడని అతని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతని తండ్రి జమీల్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సమయంలో నా ఆనందాన్ని వర్ణించడానికి పదాలు రావడం లేదని చెప్పుకొచ్చారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Maharashtra, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు