హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పాఠశాలలో షాకింగ్ ఘటన.. లిఫ్ట్ డోర్ లో ఇరుక్కుని టీచర్ మృతి..

పాఠశాలలో షాకింగ్ ఘటన.. లిఫ్ట్ డోర్ లో ఇరుక్కుని టీచర్ మృతి..

జెనెల్ ఫెర్నాండెజ్(ఫైల్)

జెనెల్ ఫెర్నాండెజ్(ఫైల్)

Mumbai: స్కూల్ లో దారుణమైన సంఘటన జరిగింది. ఆరో అంతస్తు నుంచి టీచర్ రెండో ఫ్లోర్ వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. ఇంతలో ఆమె గేట్ లో ఇరుక్కుపోయారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ముంబైలో విద్యార్థులకు బోధించి, స్టాఫ్ రూమ్ కు వెళ్తున్న టీచర్ విగత జీవిగా మారిపోయింది. ఈ ఘటన ఉత్తర ముంబైలోని శివారు ప్రాంతమైన మలాడ్‌లోని చించోలి బందర్‌లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్‌లో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. దీంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు షాకింగ్ కు గురయ్యారు.

పాఠశాల సిబ్బంది ప్రకారం.. జెనెల్ ఫెర్నాండెజ్ అనే టీచర్ మధ్యాహ్నం 1 గంటల సమయంలో రెండవ అంతస్తులోని స్టాఫ్ రూమ్‌కు వెళ్లేందుకు ఆరో అంతస్తులో వేచి ఉన్నారని సిబ్బంది తెలిపారు. ఆమె లిఫ్ట్‌లోకి ప్రవేశించిన వెంటనే తలుపులు మూసుకున్నాయని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఆమె తలకు బలమైన గాయాలయి, తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే సిబ్బంది పరుగున వెళ్లి ఆమెను బయటకు తీశారు. ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా గుజరాత్‌ (Gujarat)లోని వడోదరాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వడోదారకు చెందిన 40 ఏళ్ల మహిళ బుధవారం గోత్రి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. తన భర్తపై ఫిర్యాదు చేసింది. తన భర్త విరాజ్ వర్ధన్ తనను మోసం చేస్తున్నాడని.. అసలు అతడు పురుషుడే కాదని..స్త్రీ అని సంచలన ఆరోపణలు చేసింది. తనతో అసహజ శృంగారం చేస్తున్నాడని వాపోయింది. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.

బాధితురాలికి 14 ఏళ్ల కూతురు ఉంది. 2011లో రోడ్డు ప్రమాదంలో ఆమె మొదటి భర్త మరణించాడు. ఆ తర్వాత ఓ మాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా ఢిల్లీకిచెందిన విరాజ్ వర్ధన్‌తో పరిచయం ఏర్పడింది. అతడు ఢిల్లీ నుంచి వచ్చి వడోదరాలో స్థిరపడ్డాడు. ఇద్దరి మనసులు కలవడంతో..2014 ఫిబ్రవరి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం కాశ్మీర్‌కు కూడా వెళ్లారు. కానీ వారి మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఏర్పడలేదు. ఏవేవో సాకులు చెబుతూ వచ్చాడు. తనతో ఎందుకు శృంగారంలో పాల్గొనడం లేదని ఆమె ఒత్తిడి చేయడంతో.. రష్యాలో తనకు ప్రమాదం జరిగిందని.. ఆ తర్వాత నుంచి శృంగారంలో పాల్గొనలేకపోతున్నాని చెప్పాడు. చిన్న సర్జరీ చేసుకుంటే సరిపోతుందని చెప్పాడు. అనంతరం 2020 జనవరిలో బరువు తగ్గించుకునేందుకు శస్త్ర చికిత్స చేయించుకుంటున్నానని చెప్పి.. కోల్‌కతా వెళ్లాడు. అక్కడ సర్జరీ పూర్తయ్యాక తిరిగి వడోదారకు వచ్చాడు. అప్పటి నుంచీ తనతో అసహజ శృంగారం చేస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Death, Mumbai

ఉత్తమ కథలు