AC train ticket rates Slashed : ప్రస్తుతం మార్కెట్లో ఏ వస్తువును ముట్టుకున్న ధరల షాక్ కొడుతోంది. ధరల పెరుగుదలతో సామాన్యుడి బతుకు భారంగా మారింది. నిత్యవసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో బెంబేలెత్తున్నారు. దేశంలోని దూర ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అందులోనూ ఏసీ బోగీల్లో వెళ్లటానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. పైగా వేసవి కాలం కావటంతో డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏసీ రైళ్లలో టిక్కెట్ ధరలను తగ్గిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి రావుసాహెబ్ దన్వే పాటిల్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ముంబై సబర్బన్ ఏసీ రైళ్లలో ప్రయాణికుల టికెట్ ధరలను 50 శాతం తగ్గిస్తున్నట్లు ముంబైలోని బైకుల్లా రైల్వే స్టేషన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రకటించారు.
త్వరలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ నిర్ణయం రాజకీయంగా కూడా ఉపయోగపడవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. రైల్వే మంత్రి తాజా ప్రకటనతో ఇకపై ముంబై లోకల్ ఏసీ రైళ్లలో సగం ధరకే ప్రయాణాలు చేయవచ్చు. ముంబైలో లోకల్ రైళ్లు ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తాయి. ముంబైలో జనం దాదాపు ఈ లోకల్ రైళ్ల ద్వారానే తమ రాకపోకలను సాగిస్తుంటారు. ఇక.,ముంబైలో ఎండవేడి కూడా విపరీతంగా వుంది. దీంతో ఒక్కసారిగా స్థానికంగా వుండే ఏసీ లోకల్ రైళ్లకు డిమాండ్ పెరిగింది. చాలా మంది వీటి ద్వారానే ప్రయాణం సాగిస్తున్నారు. కాగా,ఇటీవల పలు సంస్థలు నిర్వహించిన కొన్ని సర్వేల్లో..98 శాతం మంది ప్రయాణికులు ఏసీ రైలు టిక్కెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పగా.. 95 శాతం మంది సబర్బన్ సెక్షన్లలో మరిన్నిఏసీ రైళ్లను నడపాలని కోరుతున్నారని రైల్వే శాఖ తెలిపింది.
ALSO READ Viral Video : ఇంగ్లీష్ మాట్లాడే వాడినే పెళ్లి చేసుకుంటా..పీటలపై వరుడికి షాక్ ఇచ్చిన వధువు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mumbai Passengers, Train