Home /News /national /

MUMBAI ROWDY SHEETER CHALLENGE EVEN GOD CANNOT CATCH ME FORGET ABOUT COPS HERE IS WHAT HAPPENS NEXT HSN

దేవుడికే తరం కాదు.. ఆఫ్ట్రాల్ పోలీసులెంత..? అని సవాల్ విసిరిన రౌడీ షీటర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

రౌడీ షీటర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

రౌడీ షీటర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

సినిమా డైలాగ్ తో రియల్ పోలీసులకు ఓ రౌడీ షీటర్ సవాల్ విసిరితే, దమ్ముంటే నన్ను పట్టుకోండంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ కే మెసేజ్ పంపిస్తే, మన పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ముంబైలోని ఆరే పోలీస్ స్టేషన్ సిబ్బందికి అచ్చం అలాంటి సవాలే ఎదురైంది. చివరకు ఏం జరిగిందంటే..

ఇంకా చదవండి ...
    ’నేనొచ్చే టైమ్ రాస్కో, ఏరియాను గుర్తుపెట్టుకో, కరెక్ట్ గా అదే సమయానికి వస్తా. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి చూద్దాం‘.. అంటూ సినిమాల్లో పోలీసులకు హీరోలు, విలన్లు సవాల్ విసురుతుంటారు. అవి సినిమాలు కాబట్టి, పక్కా స్క్రిప్ట్ కాబట్టి హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికో, బలమైన విలన్ అని ప్రేక్షకులకు చెప్పడానికో పోలీసులు ఎప్పుడూ సినిమాల్లో ప్రేక్షకపాత్రకే పరిమితమవుతుంటారు. కొన్ని పోలీస్ యాక్షన్ సినిమాల్లో తప్పితే, మిగిలిన సినిమాల్లో పోలీసులను డమ్మీలుగానే చూపిస్తుంటారు. కానీ అదే డైలాగ్ తో రియల్ పోలీసులకు ఓ రౌడీ షీటర్ సవాల్ విసిరితే, దమ్ముంటే నన్ను పట్టుకోండంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ కే మెసేజ్ పంపిస్తే, మన పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ముంబైలోని ఆరే పోలీస్ స్టేషన్ సిబ్బందికి అచ్చం అలాంటి సవాలే ఎదురైంది.

    ముంబైలో పప్పు హరిశ్చంద్ర అలియాస్ ఖోప్డీ అనే ఓ రౌడీ షీటర్ ఉన్నాడు. అతడికి 26ఏళ్ల వయసు. 2013వ సంవత్సరం నుంచి పోలీసులకు అస్సలు చిక్కడం లేదు. ఎక్కడ ఉన్నాడన్నది తెలియకుండానే నేరాలకు పాల్పడుతున్నాడు. ముంబై పరిధిలోనే కాకుండా, ఫోవాయ్, సకీనాక, ఎఐడీసీ వంటి ప్రాంతాల పోలీస్ స్టేషన్లలో కూడా అతడిపై కేసులు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం హరిశ్చంద్ర అరే పోలీసులకు ఓ వ్యక్తి ద్వారా ఓ మెసేజ్ ను పంపించాడు. ’దేవుడే నన్ను పట్టుకోలేడు. ఆఫ్ట్రాల్ ఈ పోలీసులు ఎంత. నేను వారికి చిక్కను. వారు నన్ను పట్టుకోలేరు‘ అన్న సారాంశాన్ని పోలీసులకు చెప్పమని ఓ వ్యక్తిని పంపాడు.



    దీంతో ఆరే పోలీసులకు ఇదో సవాల్ గా అనిపించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే హరిశ్చంద్ర రాయల్ పామ్ ప్రాంతంలో చోరీ చేయబోతున్నాడని పక్కా సమాచారం అందింది. దీంతో మఫ్టీలో కొందరు పోలీసు సిబ్బంది శనివారం ఆ ప్రాంతంలో గస్తీ కాశారు. మొత్తానికి హరిశ్చంద్ర రాగానే అతడిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. పైగా అతడిని అరెస్ట్ చేసిన ఫొటోతో ఓ ట్వీట్ ను కూడా పెట్టారు. ’హరిశ్చంద్ర ఇప్పటికైనా దేవుడిపై అతడికి ఉన్న అభిప్రాయాన్ని, పోలీసుల శక్తిపై అతడికి ఉన్న అపనమ్మకాన్ని మార్చుకుంటాడేమో‘ అని ముంబై పోలీసులు ట్వీట్ కొట్టారు. మొత్తానికి పోలీసులకు సవాల్ విసిరి, చివరకు అడ్డంగా దొరికిపోయిన వైనం గురించి పోలీస్ శాఖలో విస్తృత చర్చ జరుగుతోంది.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Husband kill wife, Mumbai crime, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు