ప్రముఖ డైరెక్టర్ కూతురికి రేప్ బెదిరింపులు.. మోదీ మద్దతుదారులపై కేసు..

Director Anurag Kashyap: డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురిపై రేప్ బెదిరింపుల వ్యవహారంలో ముంబై పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా కశ్యప్ మహారాష్ట్ర సీఎం ఫడణవీస్, మోదీ, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

news18-telugu
Updated: May 27, 2019, 1:05 PM IST
ప్రముఖ డైరెక్టర్ కూతురికి రేప్ బెదిరింపులు.. మోదీ మద్దతుదారులపై కేసు..
అనురాగ్ కశ్యప్
  • Share this:
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురిని రేప్ చేస్తామంటూ సోషల్ మీడియాలో చేసిన బెదిరింపుల వ్యవహారంలో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురిపై మోదీ అభిమానులు చేసిన బెదిరింపులపై ఆయన ప్రధాని మోదీకి మొర పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన కశ్యప్‌పై ఆగ్రహంతో ఉన్న మోదీ అభిమానులు.. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కశ్యప్.. ‘డియర్ నరేంద్రమోదీ సర్.. మీరు. మీ పార్టీ విజయం సాధించినందుకు అభినందనలు. కానీ మీ ఫాలోవర్స్ వ్యవహరిస్తున్న తీరుకు థాంక్స్. నా కూతురిని రేప్ చేసి వేడుక చేసుకొంటామని మీ అభిమానులు బెదిరిస్తున్నారు. ఇలాంటి మూకలను ఎలా డీల్ చేయాలో కాస్త చెప్పండి’ అని ట్వీట్ చేశారు.దీంతో రంగంలోకి దిగిన మహారాష్ట్ర ప్రభుత్వం నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అంబోలీ పోలీసులు నిందితులపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67 సెక్షన్ కింద, అలాగే ఐపీసీ 504, 509 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఈ సందర్భంగా ‘ముంబై పోలీసులు, మహారాష్ట్ర సైబర్ సెల్ విభాగానికి థ్యాంక్స్. మూకలను గుర్తించడానికి తీసుకొన్న చర్యలు, మాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ప్రధాని నరేంద్రమోదీకి థ్యాంక్స్. ఇప్పుడు నేను ఎలాంటి భయంతో లేకుండా చాలా భద్రతతో ఉన్నాను’ అని అనురాగ్ మళ్లీ ట్వీట్ చేశారు. అయితే, కశ్యప్ ట్వీట్‌కు బదులిస్తూ.. నటి సుచిత్ర కృష్ణమూర్తి స్పందించారు. ‘మోదీకి అనుకూలమైన నాకే బెదిరింపులు వచ్చాయి. నా కూతుర్ని కూడా రేప్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వివాదంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ మీరు సోషల్ మీడియాలో మీ ట్వీట్‌ను ప్రధానికి ట్యాగ్ చేయడంలో అర్ధమేమన్నా ఉందా అంటూ సుచిత్ర ప్రశ్నించారు.First published: May 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు