హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు ఫోన్ కాల్.. RFH ఆస్పత్రి, ఆంటిలియా దగ్గర భద్రత పెంపు

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు ఫోన్ కాల్.. RFH ఆస్పత్రి, ఆంటిలియా దగ్గర భద్రత పెంపు

కుటుంబసభ్యులతో ముఖేష్ అంబానీ (ఫైల్ ఫోటో)

కుటుంబసభ్యులతో ముఖేష్ అంబానీ (ఫైల్ ఫోటో)

Mukesh Ambani: బెదిరింపు ఫోన్ కాల్ నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రితో పాటు ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలియా వద్ద భద్రతను పెంచారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపు ఫోన్ కాల్ రావడం పట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈరోజు 12:57కి రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి ఫోన్ కాల్ వచ్చిందని నీలోత్పల్ డీసీపీ మీడియాలో సమావేశంలో తెలిపారు. ఆసుపత్రిని దెబ్బతీస్తానని ఫోన్ చేసిన ఆగంతకుడు.. అంబానీ కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించినట్టు డీసీపీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రితో పాటు ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలియా వద్ద భద్రతను పెంచినట్టు చెప్పారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేసినట్టు వివరించారు.

  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 12.57 గంటలకు సర్కిల్ 2 పరిధిలోని డిబి మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిలయన్స్ ఫౌండేషన్(Reliance Foundation) హాస్పిటల్ నంబర్‌కు తెలియని నంబర్ నుండి బెదిరింపు కాల్ వచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని పేల్చివేస్తానని ఆగంతకుడు బెదిరించాడు. దీనిపై డాక్టర్ డిబి మార్గ్ పోలీస్ థానేలో కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫోన్‌‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఫోన్ కాల్ మహారాష్ట్ర(Maharashtra) బయటి నుంచి వచ్చింది. ఫోన్ కాల్ లొకేషన్‌ను గుర్తించామని పోలీసులు తెలిపారు.

  ఇంతకు ముందు ఆగస్టు 15వ తేదీన కూడా రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు ఇలాంటి కాల్ వచ్చింది. ఆ వ్యక్తి ముఖేష్ అంబానీ ప్రాణాలకు ముప్పు కలిగిస్తూ ఆసుపత్రి డిస్‌ప్లే నంబర్‌కు ఎనిమిది బెదిరింపు కాల్‌లు చేసాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపు కాల్‌కు సంబంధించి ముంబైలోని పశ్చిమ శివారులో నివసిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది ఇదే సమయంలో ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలియా వెలుపల అనుమానాస్పద స్కార్పియో నిలబడి కనిపించింది. ఈ అనుమానాస్పద స్కార్పియో గురించి యాంటిలియా భద్రతా బృందం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌లతో పోలీసు బృందం వాహనాన్ని తనిఖీ చేసింది. అందులో 20 పేలుడు జిలెటిన్ రాడ్లు, బెదిరింపు లేఖ లభ్యమయ్యాయి.

  Petrol Diesel Prices: దేశంలో మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయా ?..ఒపెక్ దేశాల కీలక నిర్ణయం ?

  Car Discount Offer: దసరా, దీపావళి ఆఫర్లు.. ఏకంగా రూ.50,000 తగ్గింపు ప్రకటించిన కంపెనీ!

  గతవారమే ముఖేష్ అంబానీకి సెంట్రల్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా వచ్చిన ముప్పు హెచ్చరికలను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఆయనకు జడ్ ప్లస్ యొక్క టాప్ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖేష్ అంబానీకి అంబానీకి మొదటిసారిగా 2013లో చెల్లింపు ప్రాతిపదికన CRPF కమాండోల ‘Z’ కేటగిరీ సెక్యూరిటీని అందించారు. ఆయన భార్య నీతా అంబానీకి కూడా ఇదే విధమైన సాయుధ భద్రత ఉంది. అయితే నీతా అంబానీకి 'Y+' కేటగిరి భద్రత కల్పిస్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా వ్యాపారవేత్తకు ముప్పు ఉందని గ్రహించిన ఇన్‌పుట్‌లను స్వీకరించిన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ సిఫార్సును అధికారికంగా రూపొందించింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Mukesh Ambani

  ఉత్తమ కథలు