Corona : వధువు, వరుడితో సహా..పెళ్లికి హాజరైన 350 మందిపై కేసు..కారణమేంటంటే...

ప్రతీకాత్మక చిత్రం

Corona : అడ్డుకట్ట పడిందని భావిస్తున్నంతలోపే.. కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ గఢ్‌లో పంజా విసురుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పది రోజుల నుంచి పరిస్థితి తీవ్రమవుతోంది.

  • Share this:
    అడ్డుకట్ట పడిందని భావిస్తున్నంతలోపే.. కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌లో పంజా విసురుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పది రోజుల నుంచి పరిస్థితి తీవ్రమవుతోంది. మూడున్నర నెలల తర్వాత రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయ్. కానీ, కొందరు వీటిని పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ముంబైలోని చెంబూర్ లో జరిగింది. వివరాల్లోకెళితే.. ఓ పెళ్లికి హాజరైన 350 మందిపై కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతున్న మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది. ముంబైలోని చెంబూర్‌లో ఆదివారం ఒక వివాహం జరిగింది. ఈ వేడుకకు సుమారు 350 మంది వరకు హాజరయ్యారు. కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు మొత్తుకుంటున్నా ప్రజలు పట్టించుకోవడంలేదు. 50 మందితోనే వేడుకలు జరుపుకోవాలని చెబుతున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

    ముంబైలోని చెంబూర్‌లో ఆదివారం ఆడంబరంగా జరిగిన పెండ్లికి హాజరైన వారు కరోనా నిబంధనలు పాటించకపోవడాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు గుర్తించారు. దీంతో పెండ్లి వేదికైన ఛేదా నగర్ జింఖానా, రిక్రియేషన్ సెంటర్‌తో పాటు వధూవరుల తల్లిదండ్రులు, పెండ్లికి హాజరైన సుమారు 350 మందిపై తిలక్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) నిబంధనలు కఠినం చేస్తోంది. మాస్క్‌లు ధరించకుండా పట్టుబడిన 13 వేల మంది నుంచి గత శుక్రవారం రూ.27 లక్షలు వసూలు చేసింది. పది నెలల్లో 15 లక్షల మంది నుంచి రూ.31 కోట్లు రాబట్టింది.
    Published by:Sridhar Reddy
    First published: