కొహ్లీ టీమ్‌ని చంపేస్తామని బెదిరింపు...యువకుడి అరెస్ట్

మోరీగావ్ జిల్లా ధర్మతుల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి ముంబైకి తరలించారు.

news18-telugu
Updated: August 22, 2019, 5:12 PM IST
కొహ్లీ టీమ్‌ని చంపేస్తామని బెదిరింపు...యువకుడి అరెస్ట్
టీమిండియా
  • Share this:
టీమిండియా క్రికెటర్లను చంపేస్తామని బీసీసీఐకి బెదిరింపు మెయిల్ పంపిన యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బెదిరింపు మెయిల్ పంపిన యువకుడిని అసోంకు చెందిన బ్రజ మోహన్ దాస్‌గా గుర్తించిన పోలీసులు ఆగస్టు 20న అతడిని అరెస్ట్ చేశారు. మోరీగావ్ జిల్లా ధర్మతుల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి ముంబైకి తరలించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టడంతో అతడికి ఆగస్టు 26 వరకు పోలీస్ కస్టడీ విధించింది. కాగా, కొన్ని రోజులు క్రితం బీసీసీఐకి ఈ మెయిల్ రావడంతో అధికారులు ముంబై ATS (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని కనిపెట్టారు.


First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>