ముంబైలో అతిభారీ వర్షాలు... రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

ముంబైలో అతిభారీ వర్షాలు

రయ్‌గడ్, థానే, పల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలో నేటి నుంచి శుక్రవారం వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

  • Share this:
    దేశవాణిజ్య రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గతకొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టం జరిగింది. అనేక ప్రమాదాలతో ఇప్పటికే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినప్పటికీ వరుణుడు కరుణించడం లేదు. రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన వాన.. మళ్లీ మొదలయ్యింది. సోమవారం ముంబైను భారీ వర్షం ముంచెత్తెంది. నేడు ముంబై, దక్షిణ కొంకణ్ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

    రయ్‌గడ్, థానే, పల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలో నేటి నుంచి శుక్రవారం వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు 'సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. కెరటాలు 40-50 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతున్నట్టు పేర్కొంది. శుక్రవారం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వివరించింది. దీంతో అప్రమత్తమైన మహాసర్కార్ అధికారుల్ని అలర్ట్ చేసింది. జనాలు ఎవరూ అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దని చెబుతున్నారు.మరోవైపు భారీ వర్షాల కారణంగా ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనం. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్లను అధికారులురద్దు చేశారు.ఇటు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులంతా తమ ప్రయాణించే విమానాల వివరాలు తెలుసుకొని బయల్దేరాలని ప్రముక ఎయిర్ లైన్ సర్వీస్ స్పైస్ జెట్ పేర్కొంది.    First published: