• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MUMBAI MAN GETS BACK GOLD CHAIN LOST 14 YEARS AGO AS RAILWAY POLICE RETURN STOLEN GOODS TO PASSENGERS SK GH

14 ఏళ్ల క్రితం రైల్లో పోగొట్టుకున్న గోల్డ్ చైన్.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. ఎలాగో తెలుసా?

14 ఏళ్ల క్రితం రైల్లో పోగొట్టుకున్న గోల్డ్ చైన్.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. ఎలాగో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

రిటైర్డ్ బిజినెస్ మ్యాన్ సురేశ్ సవాలియా 2007లో ఓ రైళ్లో ప్రయాణించాడు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్నప్పుడు అతడి బ్యాగ్ పోయింది. అందులో కొంత డబ్బుతో పాటు 22 గ్రాముల గోల్డ్ చైన్ కూడా ఉంది.

  • Share this:
ఒకసారి దొంగతనానికి గురైన వస్తువులు మళ్లీ దొరకడం అదృష్టమని చాలామంది భావిస్తారు. ఇక వేరే ప్రదేశానికి రైల్లో ప్రయాణం చేస్తూ పోగొట్టుకున్న వస్తువు దొరకడం అసాధ్యమే అనుకుంటారు. కొంతమంది దొంగలు ముఠాగా ఏర్పడి.. కేవలం రైళ్లలో ప్రయాణించేవారిని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడతారు. వీరిని పట్టుకున్నా, దోచుకున్న సొమ్ము రికవరీ కావడం మాత్రం అరుదుగా జరుగుతుంది. కానీ ఇటీవల చోరీకి గురైన రూ.14 లక్షల విలువైన వస్తువులను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 2007లో ఒక వ్యక్తి నుంచి దొంగిలించిన 22 గ్రాముల బంగారాన్ని కూడా పోలీసులు గుర్తించడం విశేషం.

ప్రయాణికుల నుంచి దొంగిలించిన ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, నగదు, బంగారాన్ని ముంబైలో స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వస్తువులను యజమానులకు తిరిగి ఇచ్చారు. మొత్తం 34 మంది ప్రయాణికులకు చోరీకి గురైన వస్తువులను తిరిగి అందించారు.

రిటైర్డ్ బిజినెస్ మ్యాన్ సురేశ్ సవాలియా 2007లో ఓ రైళ్లో ప్రయాణించాడు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్నప్పుడు అతడి బ్యాగ్ పోయింది. అందులో కొంత డబ్బుతో పాటు 22 గ్రాముల గోల్డ్ చైన్ కూడా ఉంది. తన బ్యాగ్ పోయిందని గుర్తించిన వెంటనే.. దొంగతనం గురించి సురేశ్ బొలివరీ స్టేషన్‌లో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే ఈ చోరీ జరిగిన 14 ఏళ్ల తర్వాత పోలీసులు అతడికి తన బంగారాన్ని అప్పగించారు. గోల్డ్ చైన్‌ను దొంగలు ఒక జ్యుయలరీ దుకాణంలో అమ్మినట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. షాపు యజమాని దాన్ని కరిగించి గోల్డ్ బిస్కెట్‌గా మార్చాడు. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకొని సురేశ్‌కు అప్పగించారు.

కోవిడ్ తరువాత రైళ్లను ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో రైళ్లను నడిపేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైళ్లలో చోరీలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దొంగలను పట్టుకునేందుకు రైల్వే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది చోరీకి గురైన సుమారు రూ.4.5 కోట్ల విలువైన విలువైన వస్తువులను 3,400 మంది యజమానులకు తిరిగి ఇచ్చేశారు.

తాజాగా మరో 34 మందికి వారు కోల్పోయిన వస్తువులను అప్పగించారు. ఈ సందర్భంగా రైల్వే పోలీసుల పనితీరును పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారని ప్రయాణికులు చెబుతున్నారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి కొన్ని రోజుల్లోనే దొంగలను పట్టుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

Key words
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు