• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MUMBAI LOCAL TRAINS TO RUN FROM FEBRUARY 1ST MAHARASHTRA GOVERNMENT TOOK DECISION AK

Local Trains Start: ఆ రాష్ట్రం ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే లోకల్ రైళ్లు ప్రారంభం..

Local Trains Start: ఆ రాష్ట్రం ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే లోకల్ రైళ్లు ప్రారంభం..

ప్రతీకాత్మక చిత్రం

Mumbai Local Trains: ముంబై లోకల్ రైళ్లలో రోజూ లక్షలాది మంది ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకుంటుంటారు.

  • Share this:
    లోకల్ రైళ్లు ప్రజాజీవితంలో ఎంతగా భాగమయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా అన్ని రైళ్లలాగే లోకల్ రైళ్లు కూడా రద్దయ్యాయి. ఆ తరువాత కేంద్రం రైలు సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరించినప్పటికీ.. లోకల్ రైళ్లు మాత్రం పట్టాలెక్కలేదు. ముంబై వంటి మహా నగరాల్లో ఎక్కువగా లోకల్ రైళ్లపై ఆధారపడే ప్రజలకు ఇది ఎంతో ఇబ్బందిగా మారింది. అయితే కరోనా నిబంధనలు సడలిస్తున్న నేపథ్యంలో.. తాజాగా ముంబైలో లోకల్ రైళ్లను నడపాలని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు ఎంతో ఉపశమనం లభించనుంది.

    ఫిబ్రవరి 1 నుంచి లోకల్ రైళ్లలో ప్రయాణానికి ప్రజలకు అనుమతి ఇస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు, ఆంక్షలను వచ్చే నెల 28వరకు పొడిగించిన మహారాష్ట్ర సర్కార్.. ఆ తరువాత కొద్దిసేపటికే ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఆగిపోయిన లోకల్ రైలు సర్వీసులను దశలవారీగా పునరుద్ధరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లోకల్ రైళ్లలో సాధారణ ప్రజలను అనుమతిస్తూనే.. ఇందుకోసం ప్రత్యేకమైన సమయాలను కేటాయించింది ప్రభుత్వం.

    ఉద‌యం 7 గంట‌ల లోపు, మ‌ధ్యాహ్నం 12 నుంచి 4 వ‌ర‌కు, రాత్రి 9 గంట‌ల త‌ర్వాతే ప్రజలను ఈ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ముంబై లోకల్ రైళ్లలో రోజూ లక్షలాది మంది ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకుంటుంటారు. కరోనా కేసులు తగ్గుతుండటం, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో లోకల్ రైళ్లను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం నాటికి మహారాష్ట్రంలో 20 లక్షల కరోనా కేసులు ఉండగా.. ప్రస్తుతం 50 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: