ముంబైలో భారీ అగ్నిప్రమాదం (Mumbai Fire Accident) జరిగింది. కర్రీ రోడ్డు ప్రాంతంలో ఉన్న 60 అంతస్తుల అవిఘ్నా పార్క్ టవర్ (Avighna Park Tower)లో మంటలు చెలరేగాయి. 19వ అంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను చూసి ఆ భవనంలో నివసిస్తున్న వారు భయంతో వణికిపోయారు. కొందు ప్రాణభయంతో కిందకు పరుగులు తీశారు. ఐతే ఓ వ్యక్తి 19వ అంతస్తు బాల్కని నుంచి కింద పడి మరణించారు. మృతుడిని 30 ఏళ్ల అరుణ్ తివారిగా గుర్తించారు పోలీసులు. అతడు కింద పడిన వెంటనే హుటాహుటిన KEM ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Mumbai | One person dead in fire at Avighna Park apartment building on Curry Road pic.twitter.com/pMdV4tNP7h
— ANI (@ANI) October 22, 2021
PM Narendra Modi: కరోనా టీకాలతో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాం: ప్రధాని మోదీ
ఉదయం 11.50 నిమిషాల సమయంలో భవనం నుంచి మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. 26 మందికి మంటల నుంచి కాపాడారు. ఇక ముందు జాగ్రత్తగా 19 అంతస్తులో ఉండే మిగతా వారిని కిందకు తరలించారు. ఈ ప్రమాదాన్ని లెవెల్-4 గుర్తించారు అధికారులు. అంటే చాలా తీవ్రమైన అగ్నిప్రమాదమని చెప్పారు. అగ్నిప్రమాదానికి గురైన అవిఘ్నా పార్క్ టవర్లో మొత్తం 61 అంతస్తులు ఉన్నాయి. ఐతే ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Mumbai | One person injured in fire at Avighna Park apartments, Curry Road: Fire Department
Mayor Kishori Pednekar arrives at the incident site pic.twitter.com/DRvGRTU4fv
— ANI (@ANI) October 22, 2021
Petrol Price Today: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే..
ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అంత పెద్ద భవనంలో ఫైర్ సేప్టీ తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆ వ్యవస్థ ఎందుకు యాక్టివేట్ కాదన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Maharashtra, Mumbai