Mumbai drugs case: ఢిల్లీకి చేరిన సమీర్‌ వాంఖడే .. తెర వెనుక ఏం జ‌రుగుతోంది?

డ్రగ్స్ కేసులో డబ్బు చెల్లించారనే ఆరోపణల మధ్య ఎన్‌సిబి ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఢిల్లీ చేరుకున్నారు. (చిత్రం: ANI ట్విట్టర్)

Mumbai drugs case: షారుక్ కొడుకు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్ కేసులో ఇరుకొన్న విష‌యం అంద‌రికీ తెలుసు.ఈ కేసు రోజుకో కొత్త మ‌లుపు తిరుగుతోంది. తాజాగా ఈ డ్ర‌గ్ కేసులో షారుక్ నుంచి డబ్బు డిమాండ్‌ చేశారన్న అంశంపై ఆరోపణల నేపథ్యం లో ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు.

 • Share this:
  డ్రగ్స్ కేసు (Drugs Case) బాలీవుడ్ (Bollywood) చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే షారూఖ్ ఖాన్ (Shah rukh khan) కుమారుడు ఆర్యన్‌ ఖాన్ (Aryan khan) ఈ కేసులో నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు ఆర్య‌న్‌ ఖాన్‌ (Aryan khan). అత‌నికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నాయని, బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని ముంబైలోని స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది. ఐతే తాజాగా ఈ కేసు సంచలన మలుపు తిరిగింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నివాసంలోనూ ఎన్సీబీ (NCB) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆర్థర్ రోడ్డు జైలులో తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను కలిసి వచ్చిన కాసేపటికే ఎన్సీబీ అధికారులు షాక్ ఇచ్చారు. నేరుగా మన్నాట్‌కు వెళ్లి ఇంట్లో తనిఖీలు చేపట్టారు.

  ఢిల్లీకి అధికారి..
  ఈ డ్ర‌గ్ కేసులో షారుక్ నుంచి డబ్బు డిమాండ్‌ చేశారన్న అంశంపై ఆరోపణల నేపథ్యం లో ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. ఈ విష‌యం తెలియ‌గానే మీడియా ఆన రాక‌ను క‌వ‌రేజ్ చేసే ప‌నిలో ప‌డిపోయింది. ఆయ‌న ఢిల్లీకి ఎందుకు వ‌చ్చారు అనే అంశ‌పై మీడియా ప్ర‌శ్నించింది.

  Facebook పేరును Metaverseగా ఎందుకు మార్చుకుంటోంది.. Metaverse అంటే ఏంటి?


  ఏదైనా దర్యా ప్తు సం స్థ సమన్లు ఇచ్చిం దా? అని అడిగిన ప్రశ్న ల్ని ఆయన కొట్టిపారేశారు. దిల్లీలో తనకు పని ఉం డటం వల్లే వచ్చా నని స్పష్టం చేశారు.

  ఏం జ‌రిగింది..
  అక్టోబ‌ర్ 2, 2021 రాత్రి ముం బయిలోని క్రూజ్‌ నౌకలో జరుగుతున్న డ్రగ్స్‌పార్టీపై వాం ఖడే నేతృత్వంలో ఎన్‌సీబీ దాడిచేసింది. ఈ దాడిలో షారుక్ కొడుకు ఆర్య‌న్ ఖాన్ అరెస్ట‌య్యారు. ఆ దాడి సమయంలో తాను కేపీ గోసావి అనే వ్యక్తితో కలిసి ఘటనాస్థలికి వెళ్లానని ఎన్‌సీబీ తరఫు 9మం ది సాక్షుల జాబితాలో ఉన్న ప్రభాకర్‌ తెలిపారు. ఎన్‌సీబీ తరఫున మరో సాక్షిగా ఉన్న గోసావికి తాను వ్య క్తిగత అం గరక్షకుడిగా పనిచేస్తున్నట్లు చెప్పా రు. ఆర్యన్‌ను ఎన్‌సీబీ కార్యా లయానికి తీసుకొచ్చాక శామ్‌ డిసౌజా అనే వ్య క్తితో గోసావి ఫోన్‌లో మాట్లాడాడని, రూ.25 కోట్లు డిమాం డ్‌ చేయాలని అతడికి చెబుతుండగా విన్నట్టు పేర్కొన్నారు. చివరకు రూ.18 కోట్లకు ఖరారు చేయమని, అందులో రూ.8 కోట్లు వాం ఖడేకు ఇవ్వా ల్సి ఉందని డిసౌజాకు గోసావి చెప్పాడన్నా రు. ఆ తర్వా త గోసావి, డిసౌజాలను షారుక్‌ మేనేజర్‌ పూజా దద్లానీ కలిశారని చెప్పా రు. గోసావికి ఇద్దరు వ్య క్తులు రూ.50 లక్షలు ఇచ్చారని, అం దులో రూ.38 లక్షలు తిరిగి ఇచ్చాడని.. ఈ వివరాలన్నిం టినీ తాను కోర్టుకు సమర్పిం చిన అఫిడవిట్‌లో పేర్కొ న్న ట్లు తెలిపారు.

  విచార‌ణ ప్రారంభం..
  ఈ విష‌యంపై స‌మీర్‌ వాం ఖడేపై విచారణ ప్రారంభమైనట్టు ఎన్‌సీబీ డిప్యూ టీ డీజీ జ్హానేశ్వ ర్‌ సిం గ్ తెలిపారు. ఆయనపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యా యన్నారు. ఇప్పు డే విచారణ ప్రారంభించామని.. అయితే, ఆ పదవిలో సమీర్‌ వాం ఖడే కొనసాగుతారో? లేదో చెప్ప డం మాత్రం తొం దరపాటే అవుతుం దని జ్ఞానేశ్వ ర్‌ పేర్కొ న్నారు. ప్రభాకర్ త‌న‌తో వాంఖడే, గోసావి 10 ఖాళీ పేపర్లపై సంతకాలు చేయిం చుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం గోసావి ఆచూకీ తెలియడం లేదని, అందుకే ప్రాణభయంతో తాను ఈ విషయాలను బహిర్గతం చేస్తున్న ట్లు చెప్పా రు. అయితే, ఈ ఆరోపణల్ని ఎన్‌సీబీ తోసిపుచ్చింది.
  Published by:Sharath Chandra
  First published: