ఇండిగో విమానానికి తప్పిన ముప్పు... 155మంది సేఫ్

6E983 అనే విమానం టేకాఫ్ అవ్వబోతుండగా అకస్మాత్తుగా పైలట్ విమానాన్ని నిలిపివేసినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.

news18-telugu
Updated: July 30, 2019, 12:43 PM IST
ఇండిగో విమానానికి తప్పిన ముప్పు... 155మంది సేఫ్
ఇండిగో విమానం(ఫైల్ ఫొటో)
  • Share this:
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.మధ్యప్రదేశ్ భూపాల్‌లో రాజ్ భోజ్ ఎయిర్ పోర్టు నుంచి ముంబై వెళ్లేందుకు విమానం రెడీ అయ్యింది. విమాన సిబ్బందితోపాటు... ప్రయాణికులంతా ఫ్లైట్ ఎక్కేశారు. టేకాఫ్ అయ్యే టైం కూడా అయిపోయింది. అయితే చివరినిమిషంలో ఫైలట్ ఒక్కసారిగా విమానాన్ని నిలిపివేశాడు. ఫ్లైట్ చక్రాల్లో సాంకేతిక లోపం ఉన్నట్లు ఫైలట్ గుర్తించాడు. వెంటనే అప్రమత్తమై... పై అధికారులకు సమాచారం అందించాడు. దీంతో విమానాన్ని నిలిపివేసిన అధికారులు వెంటనే అవసరమైన మరమ్మతులు చేపట్టారు.

6E983 అనే విమానం టేకాఫ్ అవ్వబోతుండగా అకస్మాత్తుగా పైలట్ విమానాన్ని నిలిపివేసినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఫ్లైట్ సడన్‌గా పెద్ద శబ్ధం చేస్తూ ఆగిపోవడంతో తామంతా భయాందోళనలు గురయ్యామన్నారు. అయితే విమానానికి అవసరమైన మరమ్మతులు చేశాక... తిరిగి విమానాన్ని యథావిధిగా ముంబైకు టేకాఫ్ అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి ఫైలట్ సరైన సమయంలో అటర్ట్ అయి సమస్యను గుర్తించడంతో 155 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.

First published: July 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>