26/11 Mumbai Attack: ముంబై మారణహోమానికి 11ఏళ్లు

నవంబర్ 26, 2008.. లష్కరే తోయిబాకి చెందిన 10మంది తీవ్రవాదులు ముంబై నగరంలో మారణహోమం సృష్టించారు.

news18-telugu
Updated: November 26, 2019, 9:53 AM IST
26/11 Mumbai Attack: ముంబై మారణహోమానికి 11ఏళ్లు
ఉగ్రవాదులు దాడి చేసిన తాజ్ మహల్ ప్యాలెస్‌..
  • Share this:
2008 నవంబరు 26 ఈరోజును ఓ ఒక్క భారతీయుడు మరిచిపోలేరు. ఎందుకంటే ఆరోజు ఉగ్రమూకలు దేశ వాణిజ్య రాజధానిలో మారణ హోమం సృష్టించారు. ముంబైలో జరిగిన ఈ మారణకాండకు ఇవాల్టీతో పదేళ్లు పూర్తయ్యాయి. నవంబర్ 26, 2008.. లష్కరే తోయిబాకి చెందిన 10మంది తీవ్రవాదులు ముంబై నగరంలో మారణహోమం సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్,తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్‌పై దాడులతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో 166మంది హతమవగా.. 300మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆనాటి మారణకాండకు ఏ ఒక్కరూ మరిచిపోలేరు.

పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి ప్రవేశించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఒబెరాయ్ హోటల్, తాజ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు దారుణ మారణహోమం సృష్టించారు. ఈ దాడికి తెగబడిన ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ పట్టుబడగా 2012 నవంబర్ 21న భారత్ అతన్ని ఉరితీసింది. ఉగ్రవాదులను అంతం చేయడానికి దేశ భద్రతా బలగాలు మూడు రోజుల పాటు శ్రమించాయి. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే తన ప్రాణాలను ఫణంగా పెట్టి, వీరోచితగా పోరాడి అశువులుభాసాడు. నాటి ఆ ఉదంతం యావత్ ప్రపంచాన్ని షాక్‌గు గురిచేసింది. ఈనాటికి కూడా హోటల్ తాజ్‌లో ఉగ్రదాడిలో ప్రాణాలు వదిలిన భారతీయుల కోసం పెద్ద ఎత్తున దేశ జనం ఘన నివాళులర్పిస్తూనే ఉన్నారు.





First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>