Mumbai Airport Close One day : మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai)లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం(CSMIA)భారతదేశంలో ప్రధాన ప్రవేశ కేంద్రాలలో ఒకటి. ఢిల్లీ తరువాత దేశంలో రెండవ రద్దీగా ఉండే విమానాశ్రయం ఇది. ప్రతి ఏటా కొన్ని కోట్ల మంది ప్రయాణికులు ఈ విమానశ్రయం గుండా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే అంత రద్దగా ఉండే ఈ విమానాశ్రయం ఒక్కరోజు మాతపడితే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు, తాజాగా ఈ విమానాశ్రయం రన్ వేలను ఒకరోజు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వర్షాకాలానికి ముందు చేపట్టే నిర్వాహణ, మరమ్మత్తు పనుల కోసం ఈ నెల 10వ తేదీన విమానeశ్రమంలోని రెండు రన్ వే లు 14/32,09/27 లను మూసివేయనున్నట్లు ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి తెలిపారు.
వచ్చే మంగళవారం (మే-10,2022)) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎయిర్ పోర్ట్ ని మూసివేస్తున్నట్లు చెప్పారు. నిర్వాహణ పనుల అనంతరం అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఎయిర్ పోర్ట్ అన్ని కార్యకలాపాలు యథావిధిగా తిరిగి ప్రారంభమవుతాయని CSMIA ప్రతినిధి తెలిపారు. ఎయిర్ పోర్ట్ మూసివేత నేపథ్యంలో విమానాలను నిర్వహించడానికి మరియు ప్రయాణీకుల అసౌకర్యాన్ని తగ్గించడానికి విమానాశ్రయం..ఎయిర్‌మెన్ లకు నోటీసును(NOTAM)జారీ చేసింది. కాగా, రన్‌వే మూసివేత అనేది ప్రతి ఏటా జరిగే తంతు అని CSMIA ప్రతినిధి తెలిపారు. విమాన ప్రయాణికుల భద్రత కోసం రన్‌వేల నిర్వహణ అనేది విధిగా కొనసాగుతున్న కార్యాచరణ అని చెప్పారు. అందువల్లే మే 10న ముంబై విమానాశ్రయాన్ని కొన్ని గంటలపాటు మూసివేస్తున్నట్లు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.