Home /News /national /

MULTIPLE DRONES SPOTTED NEAR ARMY INSTALLATION IN JAMMU KASHMIR SECURITY PERSONAL FIRED SK

ఆర్మీ స్థావరాల వద్ద 5 డ్రోన్లు.. కాశ్మీర్‌లో మళ్లీ కలకలం.. పాక్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

జమ్మూలో ఎయిర్‌పోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి జరగడం.. ఆ ఘటన జరిగిన కొన్ని రోజులకే మళ్లీ ఆర్మీ స్థావరాల వద్ద డ్రోన్‌లు కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమయింది.

    జమ్మూ కాశ్మీర్లో మళ్లీ డ్రోన్ల కలకలం రేగింది. గురువారం రాత్రి ఏకంగా  డ్రోన్లు ఆర్మీ స్థావరా సమీపంలో చక్కర్లు కొట్టాయి. అవి  అత్యంత కీలకమైన ఆర్మీ స్థావరాలు కావడం.. అక్కడ  అనుమానాస్పద డ్రోన్లు తిరగడంతో.. ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు.  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..గురువారం రాత్రి 08.15 గంటల సమయంలో సాంబా సెక్టార్‌లో ఓ డ్రోన్ తిరిగింది.  అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ డ్రోన్‌పై  పలు రౌండ్ల కాల్పులు జరిపారు. 08.05 సమయంలో కథువా  జిల్లాలోని పన్సార్‌లో ఇంకో డ్రోన్ కనిపించింది. అంతేకాదు జమ్మూలోని అంపాలా, మిరాన్ సాహిబ్, సత్వారి ప్రాంతాల్లోనూ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. జమ్మూలో ఎయిర్‌పోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి జరగడం.. ఆ ఘటన జరిగిన కొన్ని రోజులకే మళ్లీ ఆర్మీ స్థావరాల వద్ద డ్రోన్‌లు కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమయింది.

    కాగా, గత నెలలో జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. జూన్ 26న అర్ధరాత్రి 01.40 గంటల సమయంలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో బాంబులు పేలాయి. గుర్తు తెలియని డ్రోన్లు తక్కువ ఎత్తులో ఎగరుకుంటూ వచ్చి బాంబులను జారవిడిచాయి. ఓ బాంబును టెక్నికల్ ఏరియాలోని భవనంపై పడగా దాని పైకప్పుకు రంధ్రంపడింది. మరో బాంబు ఓపెన్ ఏరియాలో గ్రౌండ్‌పై నేలపై పడింది. 6 నిమిషాల వ్యవధిలోనే రెండు బాంబులు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఆ బాంబుల్లో ఆర్డీఎక్స్,నైట్రేట్ మిశ్రమాన్ని వాడినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఘటనా స్థలానికి పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు 14 కి.మీ. దూరమే ఉండడంతో.. అక్కడి నుంచే డ్రోన్‌లు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ డ్రోన్‌లను ఎవరు పంపించారన్న దానిపై ఎన్ఐఏ దర్యాప్తు జరుగుతోంది.

    మన దేశంలో ఈ తరహాలో దాడి జరగడం ఇదే మొదటి సారి. దాడిలో నేరుగా పాల్గొనకుండా.. డ్రోన్లకు బాంబులను కట్టి అవసరమైన చోట జార విడుస్తున్నారు. ఐతే తక్కువ ఎత్తులో వచ్చే ఈ డ్రోన్లను గుర్తించే రాడార్ వ్యవస్థ మన వద్ద లేదు. అందుకే అంతర్జాతీయ సరిహద్దును దాటి వచ్చే డ్రోన్లను మన భద్రతా దళాలు గుర్తించలేకపోతున్నారు. ఘటన తర్వాత హోంశాఖ, రక్షణశాఖ ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అనంతరం యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకురావాలని నిర్ణయించారు. 3,500 కి.మీ. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు ఎయిర్‌పోర్టుల వద్ద ఈ టెక్నాలజీని వినియోగించనున్నారు.

    గురువారం డ్రోన్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ రూపొందించిన విషయం తెలిసిందే. కేంద్రం ఇప్పటికే మార్చి 12న Unmanned Aerial System (UAS) రూల్స్ 2021ని విడుదల చేసింది. ఐతే ఇప్పుడు వాటి స్థానంలో డ్రోన్ రూల్స్ 2021ని తీసుకొస్తున్నారు. డ్రోన్‌కు సంబంధించిన ఈ నిబంధనలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూపొందించింది. వీటి ప్రకారం.. గాల్లో ఎగరే ప్రతి డ్రోన్‌కూ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. డ్రోన్ల తయారీ నుంచి బరువు వరకు ఎన్నో నియమ నిబంధనలను రూపొందించారు. ఐతే ప్రస్తుతం డ్రోన్ నిబంధనల ముసాయిదాను మాత్రమే రూపొందించారు. ఇంకా అమల్లోకి తీసుకురాలేదు. వీటిపై నిపుణులతో పాటు ప్రజల అభిప్రాయాలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాతే UAS రూల్స్ స్థానంలో ఈ డ్రోన్స్‌ రూల్స్‌ని నోటిఫై చేస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Drone attack, Jammu and Kashmir

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు