హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మల్టీప్లెక్స్‌లలో రూ. 100కే సినిమా టిక్కెట్లు.. ఫుడ్ అండ్ డ్రింక్ కూడా తక్కువే!

మల్టీప్లెక్స్‌లలో రూ. 100కే సినిమా టిక్కెట్లు.. ఫుడ్ అండ్ డ్రింక్ కూడా తక్కువే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఏడాది బాలీవుడ్ సినిమాలు వరుసగా పరాజయం పాలవడంతో థియేటర్ల యజమానులు, చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు దిగారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు సినిమా హాలుకు చేరుకోలేదు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Multiplex Ticket price : ఈ ఏడాది బాలీవుడ్ సినిమాలు(Bollywood movies) వరుసగా పరాజయం పాలవడంతో థియేటర్ల యజమానులు, చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు దిగారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు సినిమా హాలుకు చేరుకోలేదు. దీని కారణంగా, థియేటర్ నిర్వాహకులు(Multiplex Owners) ఇప్పుడు చౌక టిక్కెట్లతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రణాళికను పరిశీలిస్తున్నారు. గత నెలలో జాతీయ సినిమా దినోత్సవం రోజున టిక్కెట్ల ధర రూ.75 కాగా 60 లక్షల మందికి పైగా సినిమా హాలుకు చేరుకున్నారు. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా టిక్కెట్లను తక్కువ ధరకే అందించేలా ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి, షో టైమింగ్స్,ఇతర అంశాల ఆధారంగా మల్టీప్లెక్స్‌లలో సినిమా టిక్కెట్‌ల ధర ఇప్పుడు రూ.350-450 లేదా అంతకంటే ఎక్కువ. సామాన్య వినియోగదారుడు ఇంత ఖరీదైన టిక్కెట్లు కొనడం చాలా కష్టమని సినీ ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

రాబోయే సినిమాల టిక్కెట్లు తక్కువ ధరకే 

థియేటర్ ఆపరేటర్లు, పంపిణీదారులు రాబోయే సినిమాల కోసం తక్కువ, మధ్యస్థ బడ్జెట్ సినిమా టిక్కెట్‌లను చౌకగా చేయవచ్చు, అలాగే సాయంత్రం, రాత్రి షోల టిక్కెట్‌లను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో యూత్‌ని ఎక్కువగా ఆకర్షించేందుకు వీకెండ్స్‌లో కూడా ఈ తరహా ఆఫర్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

Price Down: ఈ 11 నిత్యావసరాల ధరలు భారీగా తగ్గింపు.. పండుగ పూట కేంద్రం భారీ శుభవార్త.. లిస్ట్ ఇదే..

మల్టీప్లెక్స్‌లలో స్నాక్స్‌కు కూడా తక్కువ ధర 

అదే సమయంలో, థియేటర్లలో ఖరీదైన స్నాక్స్ గురించి వినియోగదారుల నుండి ఫిర్యాదుల నేపథ్యంలో ఆహారం, పానీయాల ధరలను కూడా సవరించాలని భావిస్తున్నారు. ప్రయోగాత్మకంగా గత వారం బ్రహ్మాస్త్ర, చుప్ వంటి చిత్రాల టిక్కెట్లు రూ.100కి అమ్ముడుపోయాయి. ఇప్పుడు అజయ్ దేవగన్ చిత్రం 'దృశ్యం' నవంబర్ 2 న విడుదల కానుంది. దీని కోసం అక్టోబర్ 2 నుండి ప్రారంభ రోజు టిక్కెట్లపై 50శాతం తగ్గింపును అందించారు. అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్‌బై ఈ శుక్రవారం విడుదల కానుండగా ఈ సినిమా ప్రారంభ రోజున 150 రూపాయలకే టిక్కెట్‌ను పొందవచ్చు. ఐనాక్స్ లీజర్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ జ్యాలా మాట్లాడుతూ..."మేము కొంత సమయం తీసుకుని, టిక్కెట్ ధరలు తగ్గినప్పుడు సినిమా హాళ్లకు వచ్చేవాళ్ల సంఖ్య నిజంగా పెరుగుతుందో లేదో విశ్లేషిస్తాము. అయితే భారీ బడ్జెట్ చిత్రాలకు ఇలా చేయడం కుదరదు. ఎందుకంటే టిక్కెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నప్పుడు అది తన ఖర్చును తిరిగి పొందలేకపోతుంది. అయితే, అక్టోబర్‌లో విడుదలయ్యే చిన్న సినిమాలు తక్కువ టిక్కెట్ ధరల నుండి ఖచ్చితంగా ప్రయోజనం పొందుతాయి"అని తెలిపారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Multiplex

ఉత్తమ కథలు