Police to play band at weddings and events : ఇప్పుడు, మీరు పెళ్లిళ్లు మరియు ఇతర కార్యక్రమాలలో బ్యాండ్ వాయించే పోలీసు సిబ్బందిని చూస్తే ఆశ్చర్యపోకండి. పోలీసులు కూడా బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇకపై పెళ్లిళ్లు,ఇంత కార్యక్రమాల్లో పోలీసులు బ్యాండ్ ప్రదర్శనలు ఇస్తారు. అవును,ఇది నిజమే. అసలు పోలీసులు బ్యాండ్ ప్రదర్శనలు ఇవ్వడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా?పోలీసులు కూడా బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహిస్తారంటూ తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని ముక్తసర్(Muktsar) పోలీసులు ఈరోజు సర్క్యులర్ విడుదల చేశారు. సాధారణంగా, గణతంత్ర దినోత్సవం(Republic day) మరియు స్వాతంత్ర్య దినోత్సవం(Independence day)సందర్భంగా పోలీసు బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహిస్తారు. బ్యాండ్ మొదటి గంటకు ప్రభుత్వ ఉద్యోగి నుండి అయితే రూ.5,000 మరియు సాధారణ ప్రజల నుండి అయితే రూ.7,000 వసూలు చేయబడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సిబ్బంది నుంచి అదనంగా ప్రతి గంటకు రూ.2,500, ప్రజల నుంచి రూ.3,500 వసూలు చేస్తారు. అంతేకాకుండా రవాణా ఖర్చుగా కిలోమీటరుకు రూ.80 విధించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
అయితే, ఈ నిర్ణయం శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) ఫైర్ అయింది. ఫిరోజ్‌పూర్ ఎంపీ మరియు శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ ఓ ట్వీట్ లొ.. మార్పు యొక్క నిజమైన చిత్రం. రాష్ట్రానికి నిధులు సమకూర్చాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి దివాలా తీయడం అనేది నిజంగానే ఈ ప్రకటన రుజువు చేసింది. సిగ్గుపడుతున్నాను భగవంత్ మాన్(పంజాబ్ సీఎం)"అని తెలిపారు.
Bumper offer : ప్రభుత్వం బంపరాఫర్..ఆ ఊరికి వచ్చి స్థిరపడితే 49 లక్షల రూపాయలు ఇస్తారంట!
మరోవైపు, స్థానిక డీఎస్పీ అవతార్ సింగ్ మాట్లాడుతూ..ఇప్పుడు మాకు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌తో సహా ఎనిమిది మంది పోలీసుల బృందం ఉంది. పెళ్లి లేదా మరేదైనా వేడుకల్లో పోలీసు బ్యాండ్ ప్రదర్శన చేస్తే తప్పు లేదు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ విధానం కొనసాగుతోంది అని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.