Home /News /national /

MUKHTAR ABBAS NAQVI RESIGNS AS UNION MINISTER OF MINORITY AFFAIRS HE MAY CONTEST IN VICE PRESIDENT ELECTIONS SK

Mukhtar Abbas Naqvi: కేంద్రమంత్రి పదవికి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా

Mukhtar Abbas Naqvi: ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని ఉపరాష్ట్రపతిని చేసే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపే అవకాశమూ ఉందని ప్రచారం జరుగుతోంది.

Mukhtar Abbas Naqvi: ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని ఉపరాష్ట్రపతిని చేసే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపే అవకాశమూ ఉందని ప్రచారం జరుగుతోంది.

Mukhtar Abbas Naqvi: ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని ఉపరాష్ట్రపతిని చేసే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపే అవకాశమూ ఉందని ప్రచారం జరుగుతోంది.

    కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ (Mukhtar Abbas Naqvi) తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఐతే రేపటితో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పదవీ కాలం ముగుస్తుంది. ఆయన మళ్లీ రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేయలేదు. ఈ క్రమంలోనే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.  ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో పాటు మరో కేంద్రమంత్రి ఆర్సీపీ సింగ్ (RCP Singh) కూడా రాజీనామాను ప్రకటించారు. పదవీ కాలం ముగియడంతో వీరిద్దరు తమ పదవులను రాజీనామా చేసినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్సీపీ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇన్నాళ్లు దేశానికి, ప్రజలకు చేసిన సేవకు గాను.. వారిని అభినందించారు.



    ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చాలా సీనియర్ నేత. చాలా ఏళ్ల పాటు కేంద్రమంత్రిగా పనిచేశారు. రాజ్యసభలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. అలాంటి నేతను బీజేపీ మళ్లీ రాజ్యసభకు నామినేట్ చేయవచ్చు. కానీ బీజేపీ అలా చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే రాజ్యసభకు పంపలేదన్న ప్రచారం జరుగుతోంది. ఆయన్ను ఉపరాష్ట్రపతిని చేసే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటకే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు (Vice President Elections_ నోటిఫికేషన్ విడుదలయింది. నామినేషన్లు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మైనారిటీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన్ను... ఉపరాష్ట్రపతిని చేయాలని బీజేపీ భావిస్తోంది. రాజ్యసభనూ సమర్థవంతంగా నడపగలిగే సత్తా ఆయనకు ఉందని.. కమలం పెద్దలు బలంగా విశ్వసిస్తున్నారు. మరి ఆయన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారా? లేదంటే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌కు పంపిస్తారా? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.



    కాగా, ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి(Vice President Elections) ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం (Election Comission) షెడ్యూల్ ప్రకటించింది. జులై 5న ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు కోసం జులై 19న చివరి తేదీ. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల విత్ డ్రా‌ చేసుకునేందుకు ఈ నెల 22న చివరి తేదీ. పోటీ అనివార్యమైతే ఆగస్టు 6న ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) పదవీకాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది. దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Mukhtar Abbas Naqvi, PM Narendra Modi

    తదుపరి వార్తలు