హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Anant Ambani: దుబాయ్‌లో అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ

Anant Ambani: దుబాయ్‌లో అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దుబాయ్‌లో 80 మిలియన్ డాలర్ల (సుమారు రూ.640 కోట్లు) విలువైన బీచ్ సైడ్ విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దుబాయ్‌లో 80 మిలియన్ డాలర్ల (సుమారు రూ.640 కోట్లు) విలువైన బీచ్ సైడ్ విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది నగరంలో అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ అని ఒప్పందం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తెలిపారు. దుబాయ్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ అయిన పామ్ జుమేరా వద్ద ఉన్న ఈ ప్రాపర్టీని అంబానీ చిన్న కుమారుడు అనంత్ కోసం ఈ సంవత్సరం ప్రారంభంలో కొనుగోలు చేశారు. ఇది ప్రైవేట్ డీల్ కాబట్టి వివరాలు బయటకు రానివ్వలేదు. ఈ బీచ్-సైడ్ మాన్షన్ పామ్ జుమేరా ఐలాండ్‌కు ఉత్తర భాగంలో ఉంది. 10 బెడ్‌రూమ్‌లు, ఒక ప్రైవేట్ స్పా, ఇండోర్, అవుట్‌డోర్ పూల్స్ దీంట్లో ఉన్నాయి. అయితే ఈ ప్రాపర్టీ కొనుగోలుదారులు ఎవరో చెప్పకుండానే లగ్జరీ విల్లాకు సంబంధించిన వివరాలను స్థానిక మీడియా నివేదించింది.


ప్రపంచంలోనే అత్యంత ధనవంతులకు దుబాయ్ ఇష్టమైన మార్కెట్‌గా అభివృద్ధి చెందుతోంది. దీర్ఘకాల గోల్డెన్ వీసాలు అందించడం, విదేశీయులకు ఇంటి యాజమాన్యంపై పరిమితులను సడలించడం వల్ల వారికి దుబాయ్ బెస్ట్ డెస్టినేషన్‌గా మారింది. బ్రిటీష్ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ తన భార్య విక్టోరియా, బాలీవుడ్ మెగా స్టార్ షారుఖ్ ఖాన్‌ వంటివారు అనంత్ అంబానీ కొనుగోలు చేసిన ప్రాపర్టీకి దగ్గర్లో నివసిస్తున్నారు.



బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 93.3 బిలియన్ డాలర్ల సంపద ఉన్న ముఖేష్ అంబానీ ముగ్గురు వారసులలో అనంత్ ఒకరు. ప్రపంచంలోని 11వ అత్యంత సంపన్నుడు ముఖేష్ ఇప్పుడు 65 ఏళ్ల వయసులో ఉన్నారు. తన సామ్రాజ్యాన్ని గ్రీన్ ఎనర్జీ, టెక్, ఇ-కామర్స్‌లో విస్తరించిన తర్వాత, ఆయన నెమ్మదిగా తన పిల్లలకు కంపెనీల పగ్గాలను అప్పగిస్తున్నారు.


అంబానీ కుటుంబం విదేశాల్లో రియల్ ఎస్టేట్ ఫుట్ ప్రింట్‌ను పెంచుకుంటోంది. ముఖేష్ వారసులు రెండో ఇంటి కోసం పశ్చిమ దేశాల వైపు చూస్తున్నారని తాజా సమాచారం అందించిన వ్యక్తులలో ఒకరు చెప్పారు. గత సంవత్సరం రిలయన్స్ UKలో స్టోక్ పార్క్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి $79 మిలియన్లు వెచ్చించింది. ముఖేష్ పెద్ద కుమారుడు ఆకాష్ కోసం కొనుగోలు చేసిన జార్జియన్ కాలం నాటి భవనం ఈ సంస్థ ఆధ్వర్యంలో ఉంది. ఆకాశ్ ఇటీవలే టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అతడి కవల సోదరి ఇషా న్యూయార్క్‌లో ఒక ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారని సదరు వ్యక్తి జోడించారు.


దుబాయ్ ప్రాపర్టీ డీల్ రహస్యంగా ఉంది. రిలయన్స్‌కు సంబంధించిన ఆఫ్‌షోర్ ఎంటిటీలో ఒకటి ఈ డీల్‌ను నిర్వహిస్తుంది. అంబానీలు ఈ ప్రాపర్టీ కస్టమైజేషన్, భద్రత కోసం కొన్ని లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు ఒక వ్యక్తి చెప్పారు. గ్రూప్‌లో కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్, పార్లమెంటు సభ్యుడు, దీర్ఘకాలంగా అంబానీ సహచరుడిగా ఉన్న పరిమల్ నత్వానీ ఈ విల్లా వ్యవహారాలు పర్యవేక్షిస్తారు.


అంబానీల ప్రైమరీ రెసిడెన్స్‌గా ముంబయిలోని 27 అంతస్తుల ఆకాశహర్మ్యం ‘యాంటిలాయా’ (Antilia) కొనసాగుతుంది. ఈ భవంతిలో మూడు హెలిప్యాడ్‌లు, 168 కార్ల పార్కింగ్, 50 సీట్ల సినిమా థియేటర్, గ్రాండ్ బాల్‌రూమ్, తొమ్మిది ఎలివేటర్లు ఉంటాయి. అయితే తాజా దుబాయ్ ప్రాపర్టీ డీల్ గురించి స్పందించాలని రిలయన్స్‌కు మీడియా ఇమెయిల్స్, కాల్స్ చేసినా.. కంపెనీ స్పందించలేదు.



First published:

Tags: Dubai, Reliance, Reliance Industries

ఉత్తమ కథలు