MUKESH AMBANI SENDS SWEET BOXES TO 50000 MUMBAI COPS AHEAD OF SON AKASH AMBANIS WEDDING SK
పోలీసులకు అంబానీ పెళ్లి కానుక...50వేల మందికి స్వీట్ బాక్స్‌లు
పోలీసులకు పంపించిన స్వీట్ బాక్స్ ఇదే
ముంబై పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు స్వీట్ బాక్స్‌లను పంపించారు ముకేశ్ అంబానీ. మొత్తం 50వేల మంది పోలీస్ సిబ్బందికి ఈ మిఠాయిలు అందనున్నాయి. దేశంలోనే అపరకుబేరుడు అంబానీ తమకు స్వీట్లు పంపించడం సంతోషంగా ఉందని చెప్పారు ఖాకీలు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లిసందడి నెలకొంది. పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుకలు ముంబైలో ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 9న వ్యాపారవేత్త రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను పెళ్లాడనున్నారు ఆకాశ్. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముంబైలోని అనాథ పిల్లలకు అన్నసేవ చేశారు అంబానీ కుటుంబ సభ్యులు. ఏడాది పాటు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ఆహార సామాగ్రిని పంపిస్తామని వెల్లడించారు. ఇక తమ ఇంట్లో శుభకార్యం సందర్భంగా పోలీసులకు కూడా ప్రత్యేక కానుక పంపించారు.
ముంబై పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు స్వీట్ బాక్స్‌లను పంపించారు ముకేశ్ అంబానీ. మొత్తం 50వేల మంది పోలీస్ సిబ్బందికి ఈ మిఠాయిలు అందనున్నాయి. ఇప్పటికే స్వీట్ బాక్సులను తీసుకున్న ఖాకీలు హర్షం వ్యక్తంచేశారు. దేశంలోనే అపరకుబేరుడు అంబానీ తమకు స్వీట్లు పంపించడం సంతోషంగా ఉందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.