హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Supreme Court: ఆక్సిజన్ లభ్యతపై సుప్రీంలో విచారణ.. Reliance Industries సేవలపై ప్రశంసలు

Supreme Court: ఆక్సిజన్ లభ్యతపై సుప్రీంలో విచారణ.. Reliance Industries సేవలపై ప్రశంసలు

ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుమిత దావ్రా సుప్రీం వేదికగా ప్రశంసించారు. జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌‌కు చెందిన చమురు శుద్ధి కర్మాగారాలలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ ఉత్పత్తి గురించి తెలుసుకున్నాక..

ఇంకా చదవండి ...

  న్యూఢిల్లీ: కోవిడ్ సోకి పరిస్థితి విషమంగా ఉన్న రోగులకు అందించేందుకు దేశంలో మెడికల్ ఆక్సిజన్ ఎంతవరకూ అందుబాటులో ఉందనే అంశంపై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సుమిత దావ్రా సుప్రీం వేదికగా ప్రశంసించారు. జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌‌కు చెందిన చమురు శుద్ధి కర్మాగారాలలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ ఉత్పత్తి గురించి తెలుసుకున్నాక.. అంత భారీ స్థాయిలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి గురించి తెలిశాక ఒక అధికారిణిగా తాను ఇంకెంత సేవ చేయవచ్చనే విషయం తెలిసొచ్చిందని ఆమె చెప్పారు. ఇప్పుడు మరో 700 టన్నులకు పైగా మెడికల్-గ్రేడ్ ఆక్సిజన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోందని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్‌కు సుమిత దావ్రా తెలియజేశారు. కరోనాపై పోరు కొనసాగిస్తున్న భారత్‌కు అండగా.. తమ వంతు సేవలను రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు సాధ్యమన్నంతవరకూ.. అవకాశమున్న ప్రతీ మార్గంలో సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ ఇప్పటికే ప్రకటించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా బాధితుల కోసం వెయ్యి పడకల ఆసుపత్రిని మెడికల్ ఆక్సిజన్‌ లభ్యతతో ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తొలి విడతలో భాగంగా.. వారం రోజుల్లో 400 బెడ్లతో కరోనా బారిన పడిన వారికి వైద్య సేవలు అందిస్తామని.. మరో వారంలో 600 బెడ్లను సిద్ధం చేయనున్నట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే ఈ కోవిడ్ హాస్పిటల్‌లో వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

  ఇదిలా ఉండగా.. దేశంలో ఆక్సిజన్ కొరతతో కోవిడ్-19 రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో మెడికల్ ఆక్సిజన్‌ను అందించేందుకు రిలయన్స్ ముందుకొచ్చింది. గుజరాత్‌లోని కంపెనీ జామ్‌నగర్ రిఫైనరీలు మొదట్లో 100 టన్నుల మెడికల్-గ్రేడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేశాయి. ఈ సామర్థ్యాన్ని 700 టన్నులకు పైగా ప్రస్తుతం పెంచారు. COVID-19 వల్ల తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాలకు ఈ మెడికల్ ఆక్సిజన్‌ను రిలయన్స్ ఉచితంగా సరఫరా చేస్తోంది.

  గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఈ మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుండటం గమనార్హం. రోజుకు దాదాపు 70 వేల మంది కరోనా సోకి విషమంగా ఉన్న రోగులకు రిలయన్స్ పంపిస్తున్న ఈ మెడికల్ ఆక్సిజన్ వల్ల లబ్ధి చేకూరుతోంది. జామ్‌నగర్‌లో సిద్ధమవుతున్న కోవిడ్ హాస్పిటల్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ గత ఆదివారం స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశానికి మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్న ప్రైవేట్ సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్నింటి కన్నా ముందుండటం విశేషం.

  First published:

  Tags: Mukesh Ambani, Oxygen, Reliance Industries, Supreme Court

  ఉత్తమ కథలు