మహాశివరాత్రి సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ ముఖేష్ అంబానీ(Mukesh Ambani), ఆయన కుమారుడు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ(Akash Ambani) దర్శనం కోసం గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయానికి(Somnath Temple) వెళ్లారు. ఆలయ ట్రస్టు తరపున ఆయనకు ట్రస్టు అధ్యక్షుడు పి.కె. లాహిరి మరియు కార్యదర్శి యోగేంద్రభాయ్ దేశాయ్ వీరికి స్వాగతం పలికారు. ఆలయ పూజారి గౌరవ సూచకంగా చందనం పూశారు. ఆలయంలో ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీలు శివుడికి అభిషేకం చేసి పూజలు చేశారు. సోమనాథ్ మహదేవ్‌ను దర్శించుకోవడంతో పాటు, సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు రూ.1.51 కోట్ల విరాళాన్ని కూడా ముఖేష్ అంబానీ అందించారు. కాగా,పరమ శివునికి అంకితభావంతో, అంబానీ కుటుంబం వారి సంప్రదాయాలకు కట్టుబడి అన్ని హిందూ పండుగలను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈరోజు కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశమంతా రంగులమయం కాగా, అంబానీ కుటుంబం కూడా ఈ శుభ సందర్భంగా ప్రార్థనలు చేసి విరాళాలు అందించింది.
కాగా,గతేడాది అక్టోబర్ లో ఆకాష్ అంబానీ అక్టోబర్‌లో రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలోని ప్రసిద్ధ శ్రీనాథ్‌జీ ఆలయాన్ని సందర్శించారు, అక్కడ అతను జియో 5G సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీపావళి సందర్భంగా ఆలయ ట్రస్టుకు 1.5 కోట్ల రూపాయలను విరాళంగా కూడా అందించారు. అక్టోబర్ లోనే ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించి ఒక్కో ఆలయ కమిటీకి మొత్తం రూ.5 కోట్లు విరాళంగా అందించారు.
On #Mahashivratri, Mukesh Ambani, Chairman and Managing Director of Reliance Industries Limited, and his son, Akash Ambani, Chairman of Reliance Jio, visited Somnath Mahadev in Gujarat. Mukesh Ambani donated Rs 1.51 crore to the Somnath temple trust. pic.twitter.com/Bl5ny6RrhH
— ANI (@ANI) February 18, 2023
Brahma Muhurtham: ఈ టైమ్‌లో చదివితే అసలు మర్చిపోరు! బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి?
అంతకు ముందు, ముఖేష్ అంబానీ సెప్టెంబరులో కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. గురువాయూర్ ఆలయంకి అతని చిన్న కుమారుడు అనంత్ అంబానీతో పాటు కాబోయే కోడలు రాధిక మర్చంట్‌తో కలిసి వచ్చారు. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అంబానీ 1.51 కోట్ల రూపాయల చెక్కును అన్నదానం కోసం ఉపయోగించేందుకు విరాళం అందించారు. సెప్టెంబర్ నెలలోనే అంబానీ తిరుమలలోని వేంకటేశ్వరుడిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తిరుమల పుణ్యక్షేత్రానికి 1.5 కోట్ల రూపాయల విరాళాన్ని కూడా సమర్పించారు.
జనవరి 19న ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియాలో జరిగిన వేడుకలో అనంత్ అంబానీ.. రాధిక మర్చంట్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట జనవరి 26న తిరుమల వెంకటేశ్వర ఆలయంలో ప్రార్థనలు కూడా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akash Ambani, Gujarat, Maha Shivratri, Mukesh Ambani