హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మద్దతు ధర పాత విధానం... కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలతో అంతకు మించిన ప్రయోజనాలు

మద్దతు ధర పాత విధానం... కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలతో అంతకు మించిన ప్రయోజనాలు

ప్రతి సీజన్ లో ముందుగా పరీక్షించిన నాణ్యమైన విత్తనాన్ని రైతు భరోసాకేంద్రాల ద్వారా రైతులకు అందించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా సొంత విత్తనంపై దృష్టి పెట్టింది వ్యవసాయశాఖ. (ప్రతీకాత్మక చిత్రం)

ప్రతి సీజన్ లో ముందుగా పరీక్షించిన నాణ్యమైన విత్తనాన్ని రైతు భరోసాకేంద్రాల ద్వారా రైతులకు అందించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా సొంత విత్తనంపై దృష్టి పెట్టింది వ్యవసాయశాఖ. (ప్రతీకాత్మక చిత్రం)

Agriculture Reform Laws: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మద్దతు ధర లేకుండా పోతుందనే ప్రచారం జరుగుతోంది. అసలు విషయమేంటో తెలుసుకుందాం.

ధరలపై ప్రభుత్వాల నియంత్రణ అనే విధానం... చిన్న చిన్న ప్రయోజనాలు, లక్ష్యాల కోసమే ఉపయోగపడుతుంది. అవి ఎల్లకాలం ప్రయోజనం కలిగించవు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ విషయాన్ని మొదట్లోనే గ్రహించింది. చాలా రంగాల్లో ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై ధరల నియంత్రణ ఉండేది. ఇందులో రాజకీయ ప్రక్షాళన జరగడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. మొత్తానికి రిటైల్ ధరలను, అంతర్జాతీయ హోల్ సేల్ ధరలనూ లింక్ చేశారు. స్మాల్ సేవింగ్ స్కీములపై ఇలాగే ప్రభుత్వాల అజమాయిషీ ఉంది... ఇలాంటి వాటి వల్ల ఇప్పటికీ భారత బ్యాంకింగ్ వ్యవస్థ ఒత్తిడి, సమస్యల్లోనే ఉంది. కొన్ని ప్రభుత్వాలు... ప్రావిడెంట్ ఫండ్స్‌పై నియంత్రణ నుంచి తొలగేందుకు ప్రయత్నించాయి. తద్వారా మరిన్ని రకాలుగా కంట్రిబ్యూషన్ చేసేందుకు వీలవుతోంది.

ఎన్నో రంగాల్లో ధరలపై ప్రభుత్వాల నియంత్రణ పనిచేయనప్పుడు వ్యవసాయ రంగంలో మాత్రం ఎందుకు పనిచేస్తుంది? అదే పని మళ్లీ మళ్లీ చేస్తూ... కొత్త రకం ఫలితాలు ఆశించడం సరికాదనీ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పారు. కానీ ఇండియాలో ప్రతీదీ కంట్రోల్ ఉండాలనే కోరుకుంటారు. కనీస మద్దతు ధర (Minimum Support Prices - MSP) అనేది ఎప్పుడో హరిత విప్లవం (green revolution) తర్వాత వచ్చినది. అప్పట్లో ఉత్పత్తి, దిగుబడి పెరిగింది. దేశీయ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అప్పట్లో ఆహార భద్రత దృష్ట్యా కనీస మద్దతు ధరను తెచ్చారు. దీని ఉద్దేశమేంటంటే... రైతులు ఓపెన్ మార్కెట్‌లో అమ్మే ఆహార ధాన్యాలను కనీస మద్దతు ధర ఆధారంగా ప్రభుత్వం కొంటుంది. తద్వారా మధ్యవర్తులు ఇందులో ఎంటర్ అవ్వకుండా రైతులకు మేలు చెయ్యాలన్నది దీని ఉద్దేశం.

ఇది కొంతకాలం పనిచేసింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వమే అంతా కొనేది. కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారాయి. ప్రస్తుతం కేంద్రం 23 పంటలకు (7 ధాన్యాలు, 5 పప్పులు, 8 నూనె గింజలు, ముడి పత్తి, ముడి జనపనార,... చెరకుకు సరైన ధర) మద్దతు ధర ఇస్తోంది. కానీ కేంద్రమే వాటన్నింటినీ కొనట్లేదు. రాష్ట్రాలు కూడా అదే మద్దతు ధర ఆధారంగా కొనేందుకు వీలుంది. పెద్ద సంఖ్యలో భూములు ఉన్న భూస్వాములు ఈ ప్రయోజనం ఎక్కువగా పొందగలిగారు. చిన్న, సన్నకారు రైతులు ప్రతి సారీ ఇలాంటి మద్దతు ధరను పొందలేకపోతున్నారు. వారంతా కేంద్రానికే అమ్మలేకపోతున్నారు. అటు కేంద్రం కూడా కొన్న వాటిని నిల్వలు పెట్టాల్సి వస్తోంది. చాలా ఆహార ధాన్యాలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిడ్డంగుల్లో పాడైపోతున్నాయి.

ఇది కూడా చదవండి:Ghost: రోడ్డుపై నడుస్తూ వెళ్లిన దెయ్యం?.. CCTV ఫుటేజ్ వీడియో వైరల్

ఈ పరిస్థితుల్లో కేంద్రం ఓ పరిష్కారం తెచ్చింది. రైతులకు మార్కెట్ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు రైతులు ఓ గ్రూపుగా మారి... తమ ఉత్పత్తులకు ఏ ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ మొత్తం ఇస్తామంటాయో వాటికే అమ్ముకోవచ్చు. అలాగే... ఆ కంపెనీలతో టై-అప్ అయ్యి... మరింత నాణ్యమైన పంటల్ని (ప్రపంచస్థాయి నాణ్యత) పండించవచ్చు. జూన్‌లో ఆర్డినెన్స్ ద్వారా తెచ్చి తర్వాత చట్టాలుగా మార్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలు జూన్ నుంచి అమల్లో ఉన్నాయి. వాటి ప్రయోజనాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.

మహారాష్ట్ర నాశిక్‌లోని రైతులు... తమ ఉత్పత్తులను డైరెక్టుగా ప్రజలకే అమ్ముకుంటున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా, ఈ-కామర్స్ విధానాలను అనుసరిస్తున్నారు. మధ్యప్రదేశ్... హోషంగాబాద్ దగ్గర్లో... ఓ చిన్న రైతు... ఓ ప్రైవేట్ కంపెనీతో డీల్ కుదుర్చుకొని... తన వరి పంటకు కొత్త చట్టాల ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతున్నాడు. మహారాష్ట్రలో పంటకు గిట్టుబాటు ధర కోసం పోరాడి ఓడిన ఓ రైతు... అదే పంటను కొత్త చట్టాలను అనుసరించి... మధ్యప్రదేశ్... బర్వానీలోని ఓ వ్యాపారికి ఎక్కువ రేటుకు అమ్ముకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య, తెలంగాణ రైతులు.... కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇస్తూ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

కొత్త వ్యవసాయ చట్టాల వల్ల సప్లై చైన్ మరింత ఆధునీకరణ చెందుతుంది. కొనుగోలు దారులు వస్తారు. టెక్నాలజీని వాడుకోవచ్చు. నింజాకార్ట్, వేకూల్ వంటి సంస్థలు ఇప్పటికే చిన్న రైతులకు మద్దతుగా నిలిచాయి. రైతులు కాంట్రాక్ట్ విధానంలో ప్రైవేట్ కొనుగోలు దారులకు అమ్మేలా ఈ సంస్థలు సాయం చేస్తున్నాయి. వ్యవసాయంలో విప్లవాత్మక టెక్నాలజీ తెచ్చేందుకు అగ్రిటెక్ ప్రతినిధులు రెడీగా ఉన్నారు.

ఇండియాలో వ్యవసాయ ఉత్పత్తులు, దిగుబడి పెరిగినప్పుడు... ఇక ఇండియాలోనే కొనుగోళ్లు సరిపోవు. ఆహార భద్రత కీలకమే... అయితే... ఇండియా ఇప్పటికే దాన్ని సాధించేసింది. ఇప్పుడు ఇండియా నుంచి ఆహార ఎగుమతులు పెరగాలి. 2022 నాటికి ఇండియా రూ.4,41,441 కోట్ల వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చెయ్యాలనే టార్గెట్ ఉంది. గత రెండేళ్లుగా ఈ ఎగుమతులు రూ.2,94,294 కోట్ల దాకే ఉన్నాయి. ఇక్కడే కొత్త వ్యవసాయ చట్టాలు మేలు చేయనున్నాయి. ఐతే... మద్దతు ధర కంటే ఎక్కువ ప్రయోజనం ఆశించి, దూర దృష్టితో ఆలోచించే రైతులకే ఇది మేలు చేయనుంది. మద్దతు ధరే చాలనుకునే రైతులు... భవిష్యత్తులో కలగబోయే ఎన్నో ప్రయోజనాలను దూరం చేసుకున్నట్లు అవుతుంది.

ఇండియాలో పుడ్ ప్రాసెసింగ్‌ రంగంలో ఎన్నో పెట్టుబడులు రావాల్సి ఉంది. మౌలిక వసతులు పెరగాలి, లాజిస్టిక్స్, రవాణా పెరగాలి. కోల్డ్ స్టోరేజీలు రావాలి, టెక్నాలజీతో కూడిన మార్కెటింగ్ వ్యవస్థ రావాలి. ఇలాంటి వాటికి ప్రైవేట్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగానే ఉన్నాయి. అందుకు ఓపెన్ మార్కెట్ విధానం రావాలి. స్థిరమైన చట్టాలు ఉండాలి. ఏదైనా వివాదం తలెత్తితే వెంటనే పరిష్కారం జరిపేలా వ్యవస్థలు ఉండాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి ఈ పెట్టుబడులు ఉంటాయి కాబట్టి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లుండాలి.

ఇది కూడా చదవండి:End of the World: క్రిస్మస్‌కి ముందే యుగాంతం?.. అంతరిక్షం నుంచి ప్రళయ సంకేతం

కనీస మద్దతు ధర విధానం ఇప్పటికే భారత వ్యవసాయంలో ఉంది. ఇప్పటి కంటే రేట్లను ఇంకా పెంచే అవకాశాలు ఉండకపోవచ్చు. అందువల్ల రైతులు ఇంకా ఆ మద్దతు ధర కోసమే కాకుండా... మరింత విస్తృతమైన ప్రయోజనాలను ఆశించి పెద్ద మార్కెట్లవైపు చూడాలి.

రచయిత స్మాహీ ఫౌండేషన్ డైరెక్టర్, ఇదో పబ్లిక్ పాలసీ తింక్ టాంక్. రచయిత పుణెలో ఉంటారు.

First published:

Tags: New Agriculture Acts

ఉత్తమ కథలు