MRI Scan At Rs.50: నమ్మలేని నిజం... రూ.50కే MRI స్కాన్... ఎక్కడో తెలుసా...

MRI Scan At Rs.50: ఇది మనం ఊహించని... అరుదుగా జరిగే చిత్రమైన ఘటన. కానీ... ఇప్పుడు ఇది... సర్వసాధారణం కాబోతోంది. అంత తక్కువ ఛార్జీకే MRI స్కాన్ ఎలా చేస్తారో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 4, 2020, 11:09 AM IST
MRI Scan At Rs.50: నమ్మలేని నిజం... రూ.50కే MRI స్కాన్... ఎక్కడో తెలుసా...
రూ.50కే MRI స్కాన్ (File)
  • Share this:
MRI Scan At Rs.50 in Delhi: మనలో ప్రతి ఒక్కరికీ మాగ్నెటిక్ రిసోనాన్స్ ఇమేజింగ్ (MRI) స్కాన్‌తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుభవం ఉండే ఉంటుంది. ఈ స్కాన్ జరిపించాలంటే... ప్రస్తుతం చాలా ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు రూ.2,500 నుంచి రూ.4,000 దాకా తీసుకుంటున్నాయి. అందుకే డాక్టర్లు MRI స్కాన్ జరిపించాలని చెప్పగానే... మన గుండెలు జారిపోతాయి. అలాంటిది... ఢిల్లీలో... జస్ట్ రూ.50కే MRI స్కాన్ జరపబోతున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి ఇది అందుబాటులోకి రాబోతోంది. గురుద్వారా బంగ్లా సాహిబ్ దగ్గర ఈ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ కల్పించబోతున్నారు. ఇది దేశంలోనే అత్యంత చవకైన MRI స్కాన్ అని... ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (DSGMC) తెలిపింది.

గురుద్వారా ఆవరణలో ఉన్న గురు హరికృష్ణ హాస్పిటల్ దగ్గర ఓ డయాలసిస్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అది వచ్చే వారం నుంచి పనిచేయనుంది. ఇక్కడ డయాలసిస్ కోసం జస్ట్ రూ.600 మాత్రమే తీసుకుంటారని DSGMC అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు.

ఇక్కడ MRI స్కానింగ్ కోసం... రూ.6 కోట్ల విలువైన డయాగ్నోస్టిక్ యంత్రాల్ని యాత్రికులు విరాళంగా ఇచ్చారు. వీటిలో నాలుగు యంత్రాలు డయాలసిస్ చేస్తాయి. అలాగే... MRI స్కానింగ్ కోసం ఒకటి, అల్ట్రాసౌండ్ ఎక్స్-రే కోసం మరొకటి ఉన్నాయి. MRI స్కాన్ తప్పనిసరి అయిన వాళ్లకు రూ.50కి, అంతగా అవసరం లేకపోయినా చేయించుకునేవారికి రూ.800 తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ఐతే... ఎవరికి తక్కువ ధరకు చెయ్యాలనే అంశాన్ని దాతల కమిటీ తేల్చనుంది. తక్కువ ఆదాయం ఉండే ప్రజలకు ఎక్స్-రే, అల్ట్రాసౌండ్‌ను రూ.150 కే చేస్తామని తెలిపారు. డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే అతి తక్కువ ధరకు అందిస్తున్న సేవలు ఇవి అని సిర్సా తెలిపారు.


ఇది ఢిల్లీలో కాబట్టి... అక్కడి ప్రజలకు ఈ సదుపాయం అందుతుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఆలోచనలను ఆచరణలోకి తెస్తే... డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లి... వేలకు వేలు పోగొట్టుకునే పరిస్థితి ఉండదు. ప్రస్తుతానికి ఈ సదుపాయం ఢిల్లీకి మాత్రమే పరిమితం కానుందని తెలిసింది. ఒకవేళ ఇది సూపర్ సక్సెస్ అయితే... దేశం మొత్తం ఇలాంటివి మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది.
Published by: Krishna Kumar N
First published: October 4, 2020, 11:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading