Home /News /national /

MPS TO PICK MODI FOR 2ND INNINGS NDA II GOVT FORMATION TO BE SET IN MOTION TODAY NK

నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం... రెండోసారి మోదీ ఎన్నిక

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

NDA-II Government Formation : నరేంద్ర మోదీ హయాంలో రెండోసారి NDA ప్రభుత్వం ఏర్పాటుకి ఇవాళ బీజం పడబోతోంది.

పార్లమెంటరీ సెంట్రల్ హాల్‌లో ఇవాళ కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీలు... బీజేపీ లోక్ సభా పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకోబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో ఈ ప్రక్రియ జరగబోతోంది. ఇది జరిగిన తర్వాత... నరేంద్ర మోదీ... ప్రధానిగా ప్రమాణ స్వీకారం చెయ్యడం లాంఛనమే. మీకు తెలుసుగా... ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. NDAలో మిత్ర పక్షాలు మరో 49 సాధించడంతో... NDA కొత్త ప్రభుత్వ బలం 352 అయ్యింది. ఇవాళ మోదీని తమ నేతగా ఎంపీలు ఎన్నుకున్న తర్వాత... వారిని ఉద్దేశించి మోదీ కాసేపు ప్రసంగిస్తారని తెలిసింది. పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత NDA మీటింగ్ జరుగుతుంది.

ఐదేళ్లు NDA ప్రభుత్వాన్ని కొనసాగించిన మోదీ... శుక్రవారం 16వ లోక్ సభను రద్దు చేస్తూ... తీర్మానం ప్రవేశపెట్టారు. తన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కి ఇచ్చారు. వెంటనే ఆయన దాన్ని ఆమోదించారు. మళ్లీ ప్రధానిగా ప్రమాణం చేసేవరకూ మోదీని ఆపద్ధర్మ ప్రధానిగా ఉండమని కోరారు. అంటే ఈ నెల 30న మోదీ ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారని అనుకుంటున్నారు కాబట్టి... అప్పటివరకూ ఆయన ఆపద్ధర్మ ప్రధాని అన్నమాట. 30వ తేదీ నుంచీ 17వ లోక్ సభ పాలన మొదలైనట్లే.

ఈ నాలుగు రోజులూ మోదీ చాలా బిజీగా ఉండబోతున్నారు. కొత్త కేబినెట్‌లో బీజేపీ నుంచీ ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, మిత్ర పక్షాల్లో ఏయే నేతలకు బెర్తులు కేటాయించాలన్నదానిపై ఆ యా పార్టీలు, నేతలతో చర్చించబోతున్నారు. ఇప్పటికే ఆ సంప్రదింపులు మొదలయ్యాయి. ఈసారి అతి పెద్ద (జంబో) కేబినెట్ ఏర్పాటవుతుందనీ, అమిత్ షా కీలక పదవి చేపడతారని తెలుస్తోంది. ఆల్రెడీ ఉన్న సీనియర్ నేతలైన రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రవి శంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్, నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటూ... కొత్తవారికి కూడా అవకాశం లభిస్తుందని తెలుస్తోంది.

NDA మిత్రపక్షాల్లో... మహారాష్ట్రలో 18 సీట్లు సాధించిన శివసేన, బీహార్‌లో 16 సీట్లు సాధించిన జేడీయూకి కేబినెట్ బెర్తులు ఇస్తారని తెలుస్తోంది. ఈ పార్టీల అధినేతలతో అమిత్ షా చర్చిస్తారని ఢిల్లీ వర్గాలు తెలిపాయి.

మే 28న మోదీ... తన సొంత నియోజకవర్గం వారణాసి వెళ్లి... తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలపనున్నారు. మే 29న గుజరాత్ వెళ్లి, 95 ఏళ్ల తల్లి హీరాబెన్ మోదీ నుంచీ ఆశీర్వాదం తీసుకోనున్నారు. ఆ తర్వాత మే 30న ప్రధానిగా రెండోసారి ప్రమాణం చేస్తారని ఇప్పటివరకూ తెలిసింది.

 

ఇవి కూడా చదవండి :

మళ్లీ తెరపైకి హరీష్‌ రావు... కేసీఆర్‌తో చర్చ... టీఆర్ఎస్‌లో మార్పు మొదలైందా...

ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్... 16కి చేరిన మృతుల సంఖ్య... ఇద్దరు భారతీయులు కూడా...

చంద్రబాబు మైండ్ బ్లాంక్... ఫలితాలపై తీవ్ర ఆవేదన... డ్రామాలు చాలన్న వైసీపీ...
First published:

Tags: Lok Sabha Election 2019, Narendra modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు