డెహ్రాడూన్‌లో వ్యాలీ ఆఫ్ వర్డ్స్ ఇంటర్నేషనల్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఫెస్టివల్ (Valley of Words International Literature and Arts Festival)లో ‘‘VOX పాపులి - పార్లమెంటేరియన్స్ డిబేట్’’ నిర్వహించారు. దీనిలో డీలిమిటేషన్ వే ఫార్వర్డ్ ఫర్ బెటర్ రిప్రెజెంటేటీవ్ ఎంగేజ్మెంగ్ విత్ డెమొక్రటిక్ అప్పారటస్("Delimitation : Way Forward for better representative engagement with democratic apparatus?!") పై ఆదివారం చర్చ జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. వారిలో బీజేపీకి చెందిన అర్జున్ మేఘవాల్, వివేక్ తంఖా (కాంగ్రెస్), సంజయ్ సింగ్ (AAP), మనోజ్ ఝా (RJD), జాన్ బ్రిట్టాస్ (CPI M) ప్రియాంక చతుర్వేది (శివసేన), K కేశవ రావు (TRS), & అమర్ పట్నాయక్ (BJD) ఉన్నారు.
ఈ ప్యానెలిస్ట్ (panelists)లు చర్చనీయాంశంపై ముఖ్యమైన సలహాల సూచనలు అందించారు. పాలన సమస్యలు, జనాభా మరియు ప్రాంతీయ సమతుల్యత , సంస్కరణలపై ఎంపీలు వారి దృక్పథం తెలియజేశారు. కాగా, ఈ చర్చ phygital way ( భౌతికం, డిజిటల్ మార్గంలో) జరిగింది. ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ (YouTube) ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. రాజీవ్ రంజన్ శ్రీవాస్తవ చర్చలో ముఖ్యమైన సమాచారాన్ని అందించారు.
డెహ్రాడూన్‌లోని ఇంటర్నేషనల్ లిటరేచర్ & ఆర్ట్స్ ఫెస్టివల్, చరిత్రకారుడు, పాలసీ అనలిస్ట్ , ఫెస్టివల్ డైరెక్టర్ వ్యాలీ ఆఫ్ వర్డ్స్ సంజీవ్ చోప్రా (Sanjeev chopra) మాట్లాడుతూ.. “ వ్యక్తులు , సంఘాల మధ్య చర్చలు మరియు పరస్పర చర్యల ద్వారా కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. VOX పాపులి పార్లమెంటేరియన్స్ డిబేట్ అనేది వ్యాలీ ఆఫ్ వర్డ్స్ ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్, ఆర్ట్స్ ఫెస్టివల్‌లో ముఖ్యమైన భాగంగా మారింది” అన్నారు.
ఈ డిబేట్ క్యూరేటర్, ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి, సామాజిక పారిశ్రామికవేత్త డాక్టర్ అమ్నా (Social Entrepreneur Dr Amna) ఈ అంశంపై మాట్లాడుతూ.. ఇలాంటి చర్చలో పాల్గొనడం వల్ల సమర్థవంతమైన విమర్శనాత్మక ఆలోచన ఏర్పడుతుందని (generates effective critical thinking), ఇది విభిన్న కళాత్మక మరియు సాంస్కృతిక వ్యక్తీకరణలకు చాలా ముఖ్యమైనదని అభిప్రాయం వ్యక్తంచేశారు.
అమ్నా ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలోని SPM కాలేజీలో పొలిటికల్ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. కళలు సంస్కృతి సంబంధిత కార్యక్రమాలతో అమ్నా ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉన్నారు. ఈమె పలు మ్యాగజైన్లకు క్రమం తప్పకుండా కాలమ్‌లు రాస్తారు. ఆమె HarvardX, United Business Institutes (బెల్జియం) నుండి అదనపు కోర్సులను కూడా అభ్యసించింది. ఈమె ఏడు పుస్తకాలను రాశారు. కాగా, పీడ్ రివ్యూడ్ జర్నల్స్‌లో అమ్నా దాదాపు 30 పరిశోధనా పత్రాలను అందించారు. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో 100 కంటే ఎక్కువ కాన్ఫరెన్స్‌లలో పాల్గొని పేపర్ ప్రెజెంటేషన్, ఉపన్యాసాలు ఇచ్చింది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Festival, Indian parliament, Latest news, Review meeting