నామినేషన్ కోసం పదివేల చిల్లర పట్టుకొచ్చిన అభ్యర్థి... అన్నీ రూపాయి బిళ్లలే

డిపాజిట్ సొమ్మును రూపాయి బిళ్లల రూపంలో పట్టుకొచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి... గంటన్నర పాటు చిల్లర లెక్కించిన ఐదుగురు అధికారులు... జనాల దగ్గర నుంచి సేకరించిన డబ్బును అలాగే డిపాజిట్ చేయాలనే ఉద్దేశంతో చిల్లర పట్టుకొచ్చానని చెప్పిన ఇండోర్ ఎమ్మెల్యే అభ్యర్థి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 10:54 PM IST
నామినేషన్ కోసం పదివేల చిల్లర పట్టుకొచ్చిన అభ్యర్థి... అన్నీ రూపాయి బిళ్లలే
చిల్లర నాణేలు (Photo: indiacoinsandnotes.blogspot)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 10:54 PM IST
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నిధులు నిర్వహిస్తున్న ఎలక్షన్ కమీషన్ అధికారులకు పెద్ద చొక్కొచ్చి పడింది. ఇండోర్-3 అసెంబ్లీ స్థానంలో పోటీ చేసేందుకు బరిలో దిగుతున్న ఓ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చాడు. అందరిలా రోటీన్‌గా నామినేషన్ దాఖలు చేస్తే గుర్తింపు ఎలా వస్తుందని అనుకున్నాడో ఏమో... నామినేషన్ ఫీజు కోసం చెల్లించాల్సిన మొత్తాన్ని చిల్లర రూపంలో పట్టుకొచ్చాడు. అదీ పది, ఐదు రూపాయల బిళ్లల కూడా ఏకంగా... అన్నీ ఒక్క రూపాయి బిళ్లలే. పది వేల రూపాయి బిళ్లలను చూసి అధికారులు షాక్ అయ్యారు. ఐదుగురు అధికారులు కలిసి కష్టపడి లెక్కించడం మొదలెడితే... పది వేల చిల్లర తేలడానికి గంటన్నర పట్టింది.

నవంబర్ 28న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11న జరగనుంది. ఇండోర్ సిటీలోని అసెంబ్లీ నియోజికవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వర్నిమ్ భారత్ ఇంక్విలాబ్ పార్టీ అభ్యర్థి దీపక్ పవార్... నామినేషన్ రుసుము కింద డిపాజిట్ చేయాల్సిన డబ్బును మొత్తం రూపాయి బిళ్లల రూపంలో పట్టుకొచ్చాడు. ఈ చిల్లర చూసిన రిటర్నింగ్ అధికారి శశ్వాంత్ సింగ్ అండ్ కో ఆశ్చర్యపోయారు. ఆయనతో పాటు మరో నలుగురు అధికారులు కలిసి గంటన్నర పాటు కష్టపడి చిల్లర మొత్తం లెక్కించారు. దీపక్ పవార్ ఓ అడ్వకేట్. జనాల దగ్గర నుంచి సేకరించిన డబ్బును అలాగే డిపాజిట్ చేయాలనే ఉద్దేశంతో చిల్లర పట్టుకొచ్చినట్టు సమాధానమిచ్చాడు దీపక్. చిల్లర లెక్కించేసరికే నామినేషన్ సమయం ముగిసిపోవడంతో పవార్‌కు రసీదు ఇచ్చిన అధికారులు... రేపు రమ్మని పంపించేయడం కొసమెరుపు.

First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...