కమల్‌నాథ్ ప్రభుత్వానికి షాక్... సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం...

Madhya Pradesh Assembly Floor Test : అసెంబ్లీలో బల నిరూపణ జరగనివ్వకుండా... ప్రభుత్వం స్పీకర్ ద్వారా రాజకీయ ఎత్తుగడ వెయ్యడంతో... విషయం సుప్రీంకోర్టు తేల్చాల్సి వస్తోంది.

news18-telugu
Updated: March 17, 2020, 1:02 PM IST
కమల్‌నాథ్ ప్రభుత్వానికి షాక్... సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం...
కమల్‌నాథ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
Madhya Pradesh Assembly Floor Test : మధ్యప్రదేశ్ కమలనాథ్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఓవైపు బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశిస్తే... బల నిరూపణ జరగనివ్వకుండా స్పీకర్ ద్వారా ఎలా ఆపేస్తారనీ, దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు... కమలనాథ్ ప్రభుత్వాన్నీ, స్పీకర్‌ ప్రజాపతి, అసెంబ్లీ ప్రిన్సిపల్ సక్రెటరీ, గవర్నర్‌ని ఆదేశించింది. బుధవారం ఉదయం 10.30కి మళ్లీ విచారణ జరుపుతామని తెలిపింది. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ... మధ్యప్రదేశ్ బీజేపీ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్... సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు... ఆ పిటిషన్ న్యాయబద్ధమైనదిగా భావిస్తూ... ప్రభుత్వానికి నోటీస్ పంపింది. ఇప్పుడు కమలనాథ్ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇచ్చినా... సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటుతిరిగీ ఇటుతిరిగీ చివరకు స్పీకర్ అసెంబ్లీలో బలనిరూపణ అమలు చెయ్యక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది మొదలు.. అసెంబ్లీ పరిణామాలు, గవర్నర్ ఆదేశాలు, స్పీకర్ నిర్ణయాలు.. ప్రతీది ఆసక్తిగా మారింది. బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ ఆదేశిస్తే... కరోనా ప్రభావం ఉందని స్పీకర్ అసెంబ్లీని ఈ నెల 26 వరకు వాయిదా వేశారు. తమకు పూర్తి మెజారిటీ ఉందని కమల్‌నాథ్ సర్కారు చెబుతోంది. అయితే, స్పీకర్ నిర్ణయంతో నొచ్చుకున్న గవర్నర్... కమల్‌నాథ్ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. మంగళవారం నాడు బలపరీక్ష నిరూపించుకోవాలని, లేనిపక్షంలో మెజారిటీ లేదని నిర్ణయానికి రావాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఇకపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది.

జైపూర్‌కు తరలించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీ ప్రారంభానికి ముందే భోపాల్‌కు రప్పించారు. వారందర్ని భోపాల్‌లోని మారియట్‌ హోటల్‌కు తరలించారు. విప్ జారీ చేస్తూ ఏప్రిల్ 13 వరకు నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. ఇదిలా ఉండగా, విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉండాలంటూ బీజేపీ కూడా తన ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసింది. బలపరీక్షపై ఢిల్లీలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నివాసంలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌, జ్యోతిరాదిత్య సింధియా భేటీ అయ్యారు. బెంగళూరులో ఉన్న 22 మంది కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు సైతం భోపాల్‌కు చేరుకున్నారు.
Published by: Krishna Kumar N
First published: March 17, 2020, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading