హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Documentary on Gir | గిర్ అభయారణ్యంపై ఎంపీ పరిమళ్ నత్వానీ డాక్యుమెంటరీ.. 12 ఎపిసోడ్లు ఇక్కడ చూడొచ్చు

Documentary on Gir | గిర్ అభయారణ్యంపై ఎంపీ పరిమళ్ నత్వానీ డాక్యుమెంటరీ.. 12 ఎపిసోడ్లు ఇక్కడ చూడొచ్చు

గిర్ అభయారణ్యంపై డాక్యుమెంటరీ రూపొందించిన పరిమళ్ నత్వానీ

గిర్ అభయారణ్యంపై డాక్యుమెంటరీ రూపొందించిన పరిమళ్ నత్వానీ

పరిమళ్ నత్వాని సొంతంగా 35 సంవత్సరాల క్రితం తన మిషన్‌ను ప్రారంభించారు. గిర్ అడవి, దాని గర్వకారణమైన "లయన్స్" అభివృద్ధికి కృషి చేయడానికి స్థానికులను పట్టుదలతో ఒప్పించారు. అప్పటి నుంచి అటవీ అధికారులు, ఆ ప్రాంత ప్రజల సహకారంతో గిర్ అటవీ సింహాలను రక్షించారు.

ఇంకా చదవండి ...

  వన్యప్రాణుల ప్రేమికుడు, పార్లమెంటు సభ్యుడు పరిమళ్ నత్వానీ ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఆసియా సింహాలకు ఆవాసమైన గిర్ గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని కథలను ఎంచుకుని ఆయన 12 ఎపిసోడ్లతో దీన్ని నిర్మించారు. దీనికి ది ప్రైడ్ కింగ్డమ్ అని పేరు పెట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ లయన్ కింద పరిమళ్ నత్వాని చేతులు మీదుగా ఈ ధారావాహిక రూపుదిద్దుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా, గిర్ సింహాలను సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి నరేంద్ర మోదీ చేసిన ప్రయత్నాలు ఎడతెగనివి. అలాగే, ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రిగా, గిర్ సింహాల పట్ల ఆయన చేసిన సేవలను పునరుజ్జీవింపజేయడానికి కట్టుబడి ఉన్నారు. గిర్‌లోని సింహాల అద్భుతమైన అంతర్గత కథనం మొదటిసారిగా చిత్రీకరించారు. ఒకేలాంటి రెండు కవల ఆసియా సింహాలు, భూరియా బ్రదర్స్, కథలోని ప్రధాన పాత్రలు తమ భూభాగాన్ని ఎలా నియంత్రించుకుంటాయో చూడొచ్చు. ఈ ధారావాహిక చిరుతపులి, ఇతర జంతువులలో భయాన్ని ఒక ఎపిసోడ్‌లో చూపిస్తుంది. సింహం అడవికి రాజు ఎందుకయ్యిందనేది చూపిస్తుంది.

  ఒక అసాధారణ సంఘటన, సింహాల ప్రవర్తన మరియు మానవులతో వాటి పరస్పర చర్యలు ఇందులో చూపించారు. ఇది పులి పిల్లల పెంపకం, తల్లి ద్వారా వాటికి వేటాడే శిక్షణ గురించి కూడా తెలియజేస్తుంది. అలాగే, సింహం తన పిల్లలను రక్షించుకోవడానికి తన ప్రాణాలను ఎలా పణంగా పెడుతుందో కూడా ఇందులో చూడొచ్చు. ఇందులో లయన్ హాస్పిటల్లో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

  ఈ డాక్యుమెంటరీ మీద రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ డైరెక్టర్ (కార్పొరేట్ వ్యవహారాలు), పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), వన్యప్రాణుల ఔత్సాహికుడు పరిమళ్ నత్వానీ మాట్లాడుతూ, “నేను గిర్‌ను 35 సంవత్సరాలకు పైగా క్రమం తప్పకుండా సందర్శిస్తున్నాను. ఆసియాటిక్ లయన్స్ యొక్క రాచరిక స్వభావం నన్ను ఆకర్షిస్తుంది, గుజరాత్‌లోని గిర్ ప్రపంచవ్యాప్తంగా ఆసియా సింహాలకు ఏకైక నివాసం, ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు గిర్‌ను సందర్శిస్తున్నప్పటికీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికీ దీనికి తగిన గుర్తింపు రాలేదు. ఈ డాక్యుమెంటరీ లక్ష్యంగా గిర్‌లోని ఆసియా సింహాల గురించి తెలియని కథను చూపించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం.” అని చెప్పారు.

  పరిమళ్ నత్వాని సొంతంగా 35 సంవత్సరాల క్రితం తన మిషన్‌ను ప్రారంభించారు. గిర్ అడవి, దాని గర్వకారణమైన "లయన్స్" అభివృద్ధికి కృషి చేయడానికి స్థానికులను పట్టుదలతో ఒప్పించారు. అప్పటి నుంచి అటవీ అధికారులు, ఆ ప్రాంత ప్రజల సహకారంతో గిర్ అటవీ సింహాలను రక్షించడానికి అనేక సమస్యలను నత్వాని ఎదుర్కొన్నారు. ఆ సమిష్టి కృషి ఫలితంగానే నేడు సింహాల 'రాజ్యం' గిర్ నేషనల్ పార్క్ విస్తరించింది.

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 1000 కోట్ల నిధులు ప్రాజెక్ట్ లయన్ కోసం కేటాయిస్తున్నారు.. మే 2022లో గిర్ నేషనల్ పార్క్‌ను సందర్శించిన సందర్భంగా, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, గుజరాత్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులను ఈ ప్రాంతం రాబోయే 25 ఏళ్లలో సింహాల నివాసంగా ఉండే విధంగా ప్రణాళికను సిద్ధం చేయవలసిందిగా కోరారు. ఈ సిరీస్ జియో, యూట్యూబ్ మొదలైన సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంటుంది.

  ఇందులో ఉండే ఎపిసోడ్లు...

  1.కహానీ కి ఖోజ్

  2. భూరియా బంధు కి కహానీ

  3. భూరియా బంధు ఔర్ తిలియా కి టక్కర్

  4. మా అఖిర్ మా హై

  5. భాయ్ కి భాయ్ సే నా బానీ

  6. షాజాదో కి పర్వారిష్

  7. షికార్ ఔర్ షికారి

  8. పునర్మిలన్

  9. సౌహార్ద్ ఔర్ సాహ్-అస్తిత్వ

  10. షాహి మారిజ్ ఔర్ ఉన్కా ఇలాజ్

  11. షాహి సుల్తానాత్ కే సాథీ

  12. ఇతిహాస్ కే పన్నో మీ

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Gujarat, Parimal Nathwani

  ఉత్తమ కథలు