Diwali Gift | పేద పిల్లలకు ఫైవ్ స్టార్ డిన్నర్ ఇచ్చిన మంత్రి

జీతు పట్వారీ ప్రతి సంవత్సరం దీపావళి పండుగను ఇలాగే జరుపుకొంటారు.

news18-telugu
Updated: October 28, 2019, 3:59 PM IST
Diwali Gift | పేద పిల్లలకు ఫైవ్ స్టార్ డిన్నర్ ఇచ్చిన మంత్రి
పేద పిల్లలకు వడ్డిస్తున్న మంత్రి జీతు పట్వారీ (Image:ANI)
  • Share this:
కడుపు నిండా భోజనం ఉంటే చాలని సంబరపడే పేద పిల్లలకు ఫైవ్ స్టార్ హోటల్లో డిన్నర్ ఇచ్చారు ఓ మంత్రి. పేద పిల్లలను బస్సులో తీసుకుని వెళ్లి.. వారికి కడుపు నిండా వెరైటీ రకాల వంటకాలతో భోజనం తినిపించి.. ఆ తర్వాత దీపావళి పండుగకు గిఫ్ట్‌లు ఇచ్చి పంపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. ఆ మంత్రి పేరు జీతు పట్వారీ. ఇండోర్‌లో ఉన్న రాడిసన్ హోటల్ ముందు ఓ బస్సు ఆగింది. ఆ బస్సులో పేద పిల్లలు దిగారు. అంత పెద్ద హోటల్లోకి వారు అడుగు పెట్టడం అదే తొలిసారి. బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్న ఆ పిల్లలకు అప్పటికే మంచి డ్రెస్సులు కొనిపెట్టారు ఆ మంత్రి. తాను కూడా ఆ పిల్లలతో కలసి వచ్చారు. అనంతరం వారిని వెంటబెట్టుకుని హోటల్‌కు లోనికి వెళ్లారు. పిల్లలు అందరినీ టేబుల్స్ వద్ద కూర్చోబెట్టి.. వారికి ఏమేం కావాలో అవి ఇవ్వాల్సిందిగా హోటల్ యాజమాన్యానికి సూచించారు. భయపడుతున్న కొందరు పిల్లలకు తానే స్వయంగా వడ్డించారు. భోజనం పూర్తయిన తర్వాత పిల్లలకు మంచి గిఫ్ట్‌లు కూడా ఇచ్చి పంపారు.





జీతు పట్వారీ ప్రతి సంవత్సరం దీపావళి పండుగను ఇలాగే జరుపుకొంటారు. జీతు పట్వారీ కుమారుడు హాస్టల్‌లో ఉండేవారు. ఓసారి, పండుగ రోజు తండ్రికి ఫోన్ చేసి.. పేద పిల్లలకు మంచి భోజనం పెట్టించేలా పండుగను ఎందుకు జరుపుకోకూడదని అడిగారట. అప్పటి నుంచి ఇలా ప్రతి దీపావళి రోజు.. పేద పిల్లలను ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకెళ్లి ఇలా విందుభోజనం వడ్డిస్తున్నారు.
First published: October 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...