MP GOVT OFFICES TO BE CLEANED ONLY WITH COW URINE PHENYL SSR
ప్రభుత్వ కార్యాలయాలను గోమూత్రంతో తయారైన ఫినాయిల్‌తో శుభ్రం చేయాలని ప్రభుత్వ ఆదేశాలు..!
ప్రతీకాత్మకచిత్రం
గోమూత్రం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, చేదుగా, వెచ్చగా ఉండే గోమూత్రం వల్ల ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెబుతుంటారు. గోమూత్రంలో ఉండే పొటాషియం, క్లోరైడ్, యూరియా, కాల్షియం, ఫాస్పేట్, కార్పోలిక్ యాసిడ్ వంటి మూలకాల వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలే కాకుండా పలు చర్మ వ్యాధులను నయం చేయడంలో...
భోపాల్: గోమూత్రం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, చేదుగా, వెచ్చగా ఉండే గోమూత్రం వల్ల ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెబుతుంటారు. గోమూత్రంలో ఉండే పొటాషియం, క్లోరైడ్, యూరియా, కాల్షియం, ఫాస్పేట్, కార్పోలిక్ యాసిడ్ వంటి మూలకాల వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలే కాకుండా పలు చర్మ వ్యాధులను నయం చేయడంలో కూడా గోమూత్రం ఔషధంలా పనిచేస్తుందని పలు ఆధునిక పరిశోధనల్లో తేలింది. అయితే.. గోమూత్రానికి ఎలాంటి ఔషధ గుణాలు లేవని కొట్టిపారేశారేవారూ ఉన్నారు. గోమూత్రంపై ఇలాంటి భిన్న వాదనలు సమాజంలో వినిపిస్తున్న ఈ తరుణంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఇకపై గోమూత్రంతో తయారైన ఫినాయిల్‌తోనే శుభ్రం చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కెమికల్‌తో తయారైన ఫినాయిల్‌ను వాడొద్దని స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలపై మధ్యప్రదేశ్ పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ మాట్లాడుతూ.. గోమూత్రంతో ఫినాయిల్ తయారుచేసే పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ నిర్ణయం వల్ల పాలు ఇవ్వని ఆవులను గోవధశాలలకు తరలించే వారి సంఖ్య తగ్గుతుందని, గోవుల వృద్ధికి ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చారని ఆరోపించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా గోమూత్రంతో ఫినాయిల్ తయారు చేసే కంపెనీలను ప్రోత్సహించాలని ఉంటే ఉత్తరాఖండ్‌కు సంబంధించిన ప్రైవేట్ కంపెనీకి ఈ పని అప్పగించదని విమర్శించింది.
రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలూ ఎలా ఉన్నా గోమూత్రాన్ని సర్వ రోగ నివారిణిగా భావించి తాగే ప్రముఖులూ ఉన్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తాను ప్రతిరోజూ గోమూత్రం తాగుతానన ఓ సందర్భంలో చెప్పారు. తీవ్రమైన వ్యాధుల నుంచి కాపాడే గుణం గోమూత్రంలో ఉందని, నరాల బలహీనతనూ గోమూత్రం దూరం చేస్తుందని అత్యధికులు చెబుతుంటారు. ఆవు పేడతో గోడలను అలకడం వల్ల శుభ్రంగా ఉండటమే కాకుండా, పలు వ్యాధికారక క్రీములు దరిచేరకుండా ఉంటాయని గ్రామాల్లో నమ్ముతారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యిలో పోషక విలువలు కూడా చాలానే ఉన్నాయనడంలో సందేహం లేదు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.