27 క్వింటాళ్ల ఉల్లి @ రూ.10 వేలు...గుండెపోటుతో రైతు మృతి
news18-telugu
Updated: December 31, 2018, 3:08 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: December 31, 2018, 3:08 PM IST
ఉల్లి ధరలు పడిపోవడంతో మహారాష్ట్ర రైతులతో పాటు అటు మధ్యప్రదేశ్‌లోనూ ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. తాను అమ్మకం కోసం తీసుకొచ్చిన 27 క్వింటాళ్ల ఉల్లి ధర విలువ కేవలం రూ.10 వేలు అని తెలియడంతో ఓ రైతు ఉల్లి మార్కెట్లోనే గుండెపోటుతో మరణించాడు. భెరులాల్ మాలవ్య(40) అనే రైతు మందసౌర్ మండిలో తాను పండించిన 27 క్వింటాళ్లను విక్రయించేందుకు తీసుకొచ్చాడు. అయితే మండీలో ఒక క్వింటాల్(100) కేవలం రూ.372 ధర పలుకుతుండడంతో షాక్‌కు గురైయ్యాడు. చేసేదేమీ లేక 27 క్వింటాళ్ల ఉల్లిని రూ.10,440లు చెల్లించి ఓ వ్యాపారికి విక్రయించాడు. అతి తక్కువ ధరకు ఉల్లి విక్రయం కావడంతో అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్సా ఫలితం లేకుండా మృతి చెందారు.
ఉల్లి ధర పడిపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కేజీ ఉల్లి సాగుబడికి దాదాపు రూ.7 నుంచి రూ.8 వరకు వ్యయం చేసినట్లు చెబుతున్న రైతులు...కనీసం సాగుబడికి అయిన ఖర్చులు వెనక్కి రాకపోతే తాము ఇక ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని వారి కుటుంబీకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Video: బాలిక రేప్ కేసులో నిందితుడ్ని చితక్కొట్టబోయిన లాయర్లు... వీడియో వైరల్
నువ్వెంత పిసినారివి రా బాబు... ఇంట్లో ఏం దొరక్కపోవడంతో దొంగ ఆవేదన
నేనే నీ రాధ.. కిల్లర్‌కు ఎస్ఐ వల.. పెళ్లికూతురు గెటప్‌లో..
ఇద్దరు పిల్లల తల్లిని లవర్‌కి ఇచ్చి పెళ్లి చేయడానికి భర్త గ్రీన్ సిగ్నల్...
బస్టాండ్‌లో బ్లూఫిలిం కలకలం.. షాక్ తిన్న ప్రయాణికులు..
తల్లి, చెల్లి, మరదలిపై అత్యాచారం.. మద్యం మత్తులో వరసలు మరిచి..