పెట్రోల్ ధరల మోతపై కాంగ్రెస్ ఆగ్రహం.. రేపు ఆందోళనలు

ప్రతీకాత్మక చిత్రం

పెట్రోల్ ధరల మోతకు నిరసనగా బుధవారం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది.

 • Share this:
  దేశంలో ఇంధన ధరల మోత మోగుతోంది. వరుసగా 16 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ.. మన దేశంలో చమురు ధరలు పెరగడంతో సామాన్యుల జేబుకు చిల్లుపడుతోంది. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలకు అదనపు భారం పడుతోంది. దాంతో కేంద్రం తీరుపై కాంగ్రెస్ సహా పలు పార్టీలు మండిపడుతున్నాయి. ఇష్టానుసారం ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కరోనా ఉన్నందున భౌతిక దూరం పాటిస్తూ కార్యకర్తలంతా ఆందోళనల్లో పాల్గొనాలని నేతలు సూచించారు.

  రాత్రిళ్లు పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేసి ఉదయమే అమ్మండి. అప్పుడు లీటర్‌కు రూ.60 పైసలు లాభం వస్తుంది. ఆత్మ నిర్భర్ ( స్వయం ఆధారితం) అంటే ఇదే.
  జితూ పట్వారి, కాంగ్రెస్ నేత


  పెట్రోల్, డీజిల్‌పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీగా సెస్, ఇతర పన్నులను విధిస్తోందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. కాగా, మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.87.19గా ఉంది. ఇక లీటర్ డీజిల్ ధర రూ.78.35గా ఉంది. గత 16 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.8.30 పెరిగింది. ఇక డీజిల్ ధర రూ.9.22 పెరిగింది.

  అంతర్జాతీయంగా, ఒక లీటరు నీటి బాటిల్ కంటే ముడిచమురు ధర చౌకగా ఉందని నిపుణులు అంటున్నారు. అలా చూస్తే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాలి. కానీ అందుకు విరుద్ధంగా మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. మన దేశంలో ఇంధన ధరలు ఏకంగా రెండు సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకాయి. మార్చిలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ .3 పెంచింది. ఇది కాకుండా, లాక్ డౌన్ సడలింపు తర్వాత పెట్రోల్, డీజిల్ కోసం డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింది

  First published: