హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Emotional story: ఎగ్జామ్‌కు ముందే తండ్రి మృతి..! కన్నీళ్లు దిగమింగి... పరీక్ష రాసి

Emotional story: ఎగ్జామ్‌కు ముందే తండ్రి మృతి..! కన్నీళ్లు దిగమింగి... పరీక్ష రాసి

రియా

రియా

తండ్రి చనిపోయిన బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆ అమ్మాయి పరీక్షకు హాజరైంది..

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

విద్యార్థి దశలో కీలకమైన 12వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇలాంటి సమయంలో ఆమె విధి పరీక్ష పెట్టింది. ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగా.. నిన్నటి వరకు తనతో మాట్లాడుతూ, అల్లారు ముద్దుగా పెంచుకున్న తండ్రివిగతజీవిగా పడి ఉన్న దుఃఖాన్ని దిగమింగి పరీక్ష రాసింది. కంటి రెప్పలా కాపాడినా తండ్రి దూరమయ్యాడనే బాధ ఓ వైపు.. పరీక్ష కాలం మరో వైపు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదనే వేదన. అలాంటి తరుణంలో తండ్రి చనిపోయిన బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ ఆ అమ్మాయి పరీక్షకు హాజరైంది. హృదయాన్ని కదిలించే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబేరాలో జరిగింది.

కన్నీళ్లతో కెమిస్ట్రీ పేపర్ రాసిన కూతురు:

జబేరాలోని బన్వర్ గ్రామానికి చెందిన 12వ తరగతి విద్యార్థినికి ఉదయం 9 గంటలకు కెమిస్ట్రీ పేపర్ ఉండగా.. అదే రోజు ఉదయం ఆరు గంటల సమయంలో ఆమె తండ్రికి గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించేలోపే ఆయన చనిపోయాడు. ఓ వైపు ఇంట్లోని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉండగా.. మరోవైపు కూతరి ఎగ్జామ్‌ టైమ్‌ దగ్గర పడిందని గుర్తించారు. తండ్రి చనిపోయిన బాధ ఓ వైపు.. పరీక్ష మరోవైపు ఎటూ తేల్చుకోలేక పోయిన సందర్భంలో బంధువులు ధైర్యం చెప్పి పరీక్షకు పంపించారు. ఏడుస్తున్న కూతురికి నచ్చజెప్పి ఎగ్జామ్‌ హాల్‌ దగ్గర విడిచిపెట్టారు. తండ్రి చనిపోయిన బాధను దిగమింగి పరీక్ష రాస్తున్నంతా సేపు వస్తున్న ఏడుపును ఆపుకోని ఎగ్జామ్‌ పూర్తి చేసింది ఆ విద్యార్థిని. పరీక్ష అవ్వగానే ఎగ్జామ్‌ సెంటర్‌కు తమ్ముడు వచ్చాడు. వెంటనే ఇద్దరు కలిసి ఇంటికి చేరుకున్నారు. అప్పటివరకు వస్తున్న ఏడుపును ఒక్కసారిగా బయటపెట్టింది ఆమె. తండ్రి మృతదేహం దగ్గర కూర్చొని బోరున విలపించింది.

ఎగ్జామ్‌ బాగా రాశాను.. కానీ తండ్రే లేరు:

వాల్మీకి ముద్దుల కుమార్తె అయిన రియా 12వ తరగతి ఎగ్జామ్స్‌ రాస్తోంది. ఇప్పటివరకు అన్నీ ఎగ్జామ్స్‌ బాగా రాసింది. కెమిస్ట్రీ పేపర్‌కు ముందు తన తండ్రి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది రియా. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది అందరూ ఆమెను ఓదార్చారు. తండ్రి మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన రియా ఆ తర్వాత ఇంటికి చేరుకుని తండ్రికి అంతిమ వీడ్కోలు పలికింది. పరీక్ష ముగియగానే వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంది.

First published:

Tags: Daughters, Father, Father died, Madya pradesh

ఉత్తమ కథలు