Home /News /national /

MOVABLE PROPERTIES OF J JAYALALITHAA 601 KG SILVER 4 KG GOLD 10000 APPAREL 8300 BOOKS AND MORE SK

జయలలిత నివాసంలో భారీగా బంగారం లభ్యం.. ఏమేం వస్తువులున్నాయంటే..

జయలలిత(ఫైల్ ఫోటో)

జయలలిత(ఫైల్ ఫోటో)

చెన్నైలో ఉన్న పోయెస్ గార్డెన్‌లో 21,000 చదరపు అడుగుల్లో విశాలమైన మూడు అంతస్తుల బంగ్లా ఉంది. ఆ వేదనిలయాన్ని స్మారక కేంద్రంగా మారుస్తున్న నేపథ్యంలో అందులో ఉన్న వస్తువులు, చరాస్తులను పురచ్చి తలైవి డాక్టర్ జె జయలలిత మెమోరియల్ ఫౌండేషన్‌కు బదిలీ చేయనున్నారు.

ఇంకా చదవండి ...
    తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌లో ఉన్న వేదనిలయంలో భారీగా బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. 4.3 కిలోల బంగారంతో పాటు 601 కిలోల వెండి ఉన్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 2016 డిసెంబరులో జయలలిత అనారోగ్యంతో కన్నుమూశారు. చివరి వరకు జయలలిత నివాసమున్న వేదనిలయాన్ని స్మారక చిహ్నంగా మారుస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో మే నెలలో వేద నిలయాన్ని స్వాధీనం చేసుకుంది.

    చెన్నైలో ఉన్న పోయెస్ గార్డెన్‌లో 21,000 చదరపు అడుగుల్లో విశాలమైన మూడు అంతస్తుల బంగ్లా ఉంది. ఆ వేదనిలయాన్ని స్మారక కేంద్రంగా మారుస్తున్న నేపథ్యంలో అందులో ఉన్న వస్తువులు, చరాస్తులను పురచ్చి తలైవి డాక్టర్ జె జయలలిత మెమోరియల్ ఫౌండేషన్‌కు బదిలీ చేయనున్నారు. ఈ క్రమంలోనే వేద నిలయంలో ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకొని ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. జయలలిత నివాసంలో 14 బంగారం ఆభరణాలు, 867 వెండి ఆభరణాలు, 162 వెండి పాత్రలు, 11 టీవీలు, 10 రిఫ్రిజిరేటర్లు, 38 ఎయిర్ కండీషనర్లు, 556 ఫర్నిచర్ , 6,514 కిచెన్ పాత్రలు, 15 పూజ పాత్రలు, 1055 షో కేస్ కత్తులు, 10,438 పాదరక్షలు, 29 మొబైల్ ఫోన్లు, 221 కిచెన్ ఎలక్ట్రికల్ ఉపకరణాలు, 394 మెమోంటోలు, 653 ఐటీ, కోర్టు, లైసెన్సుల పత్రాలు లభించాయి.

    వాటితో పాటు 65 సూట్ కేసులు, 6 గడియారాలు, 108 సౌందర్య సాధనాలున్నాయి. ఐతే జయలలిత నివాసంలో పూజ వస్తువులు, పలు వస్త్రాలు, పాదరక్షలు ఇలా అన్నీ కలపి వేదనిలయంలో కలిపి మొత్తం 32,721 వస్తువులున్నాయని తేలింది. వేదనిలయం తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జులై 25న సివిల్ కోర్టులో రూ.67.9 కోట్లు జమ చేసింది. అందులో రూ.36.9 కోట్లు ఆదాయ పన్ను కింద ఐటీశాఖకు వెళ్లనున్నట్లు సమాచారం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Jayalalitha, Tamilnadu

    తదుపరి వార్తలు