Home /News /national /

MOTHER SONIA AT ED OFFICE RAHUL GANDHI LEADS CONG STIR ON DHARNA AT DELHIS VIJAY CHOWK GETS DETAINED SK

Congress Protests: ఈడీ ఆఫీసులో సోనియాపై ప్రశ్నలు.. పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ

పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ

పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ

National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలో ఆమె ఈడీ విచారణకు హాజరవడం ఇది రెండోసారి. ఇప్పటికే గురువారం ఆమె ఈడీ విచారణకు హాజరుకాగా.. ఇవాళ మరోసారి ప్రశ్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ (National Herald Money laundering Case) కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)పై ఈడీ రెండో రౌండ్ విచారణ జరుపుతున్న వేళ.. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఓవైపు ఈడీ ఆఫీసులో సోనియా గాంధీపై ప్రశ్నలు గుప్పిస్తుంటే.. మరోవైపు విజయ్ చౌక్‌లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తమ పార్టీ ఎంపీలతో కలిసి ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి.. ఈడీ వంటి సంస్థలను కక్షసాధింపునకు వాడుకుంటోందని మండిపడుతున్నారు. విజయ్ చౌక్‌లో బైఠాయించి.. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఇతర ముఖ్య నేతలను కూడా అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి తరలించారు. రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.




    ''విజయ్ చౌక్ వద్ద ధర్నా చేసేందుకు పోలీసులు అనుమతించడం లేదు. ఇది పోలీసుల రాజ్యం. మోదీ రాజ్యం. ఇదీ మన భారత దేశమంటూ'' కేంద్రంపై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ.





    నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలో ఆమె ఈడీ విచారణకు హాజరవడం ఇది రెండోసారి. ఇప్పటికే గురువారం ఆమె ఈడీ విచారణకు హాజరుకాగా.. ఇవాళ మరోసారి ప్రశ్నిస్తున్నారు. సోనియా గాంధీకి అనారోగ్య సమస్యలు ఉన్నందున.. ఆమె కూతురు ప్రియాంక గాంధీ తోడుగా ఉన్నారు. తల్లితో పాటే ఈడీ ఆఫీసుకు వెళ్లారు ప్రియాంక. తల్లిని, సోదరిని ఈడీ ఆఫీసు వద్ద దిగబెట్టి.. పార్లమెంట్‌కు వెళ్లిపోయారు రాహుల్ గాంధీ. అక్కడ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఢిల్లీ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ ధర్నాలు నిర్వహిస్తున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Congress, Enforcement Directorate, New Delhi, Rahul Gandhi, Sonia Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు