HOME »NEWS »NATIONAL »mother selling toys with dead child in odisha rescued ms

గుండెను పిండేసే విషాదం : ఒడిలో పసికందు మృతదేహంతో.. రోడ్డుపై బొమ్మలు అమ్ముతూ తల్లి

గుండెను పిండేసే విషాదం : ఒడిలో పసికందు మృతదేహంతో.. రోడ్డుపై బొమ్మలు అమ్ముతూ తల్లి
పిల్లలు కావాలనుకునే జంటలు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి.

అధికారులే ఆ చంటిబిడ్డ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్టు సమాచారం.అనంతరం ఆ మహిళకు చెందిన మరో ఇద్దరు పిల్లలను కూడా షెల్టర్ హోమ్‌కు తరలించినట్టు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు తెలిపారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదన్న అనుమానంతో ఎస్‌సీబీ ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పారు.

  • Share this:
    ఒడిశాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఒడిలో చంటిబిడ్డ మృతదేహాన్ని పెట్టుకుని.. ఓ తల్లి రోడ్డుపై బొమ్మలు అమ్మడం చూసేవారిని కలచివేసింది. అంత్యక్రియలకు డబ్బుల్లేక.. రోజూ లాగే ఆ తల్లి బొమ్మలు అమ్మేందుకు వచ్చిందని కొందరు చెబుతుండగా.. ఆమెకు మతిస్థిమితి సరిగా లేకపోవడం అలా చేసిందని మరికొందరు అంటున్నారు. ఒడిశాలోని కటక్‌లో ఉన్న బక్సీ బజార్‌లో ఈ ఘటన జరిగింది.

    నాలుగు నెలల క్రితం ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు కాస్త అనారోగ్యంతో ఉండటంతో శిశు భవన్‌లో చేర్పించారు. అయితే శిశువు పూర్తిగా కోలుకోకముందే ఆ తల్లి చంటిబిడ్డను తీసుకొచ్చేసింది. దాంతో బుధవారం ఆ చంటిబిడ్డ మరణించింది. బయటకు వచ్చేసింది. బక్సీ బజార్‌లో బొమ్మలు అమ్ముతూ చంటిబిడ్డ మృతదేహంతో కనిపించింది.
    చైల్డ్ వెల్ఫేర్ కమిటీ




    అధికారులే ఆ చంటిబిడ్డ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్టు సమాచారం.అనంతరం ఆ మహిళకు చెందిన మరో ఇద్దరు పిల్లలను కూడా షెల్టర్ హోమ్‌కు తరలించినట్టు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు తెలిపారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదన్న అనుమానంతో ఎస్‌సీబీ ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పారు. కాగా, ఆమె భర్త ఓ కూలీ అని.. కుటుంబాన్ని పోషించలేక చేతులెత్తేయడంతో.. ఆమె రోడ్డుపై పడిందని అధికారులు వెల్లడించారు.
    Published by:Srinivas Mittapalli
    First published:July 19, 2019, 07:43 IST