పిల్ల ఏనుగు చనిపోవడంతో... దాని తల్లి ఏం చేసిందో తెలుసా...

Lalgarh, West Bengal : ఈ సృష్టిలో ఏ తల్లైనా సరే... తన పిల్లలకు హాని జరిగితే తట్టుకోలేదు. మనుషుల్లోనే కాదు... జంతువుల్లోనూ అలాగే జరుగుతోందని ఈ ఘటన చెబుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 3:07 PM IST
పిల్ల ఏనుగు చనిపోవడంతో... దాని తల్లి ఏం చేసిందో తెలుసా...
గున్న ఏనుగును కదుపుతున్న తల్లి ఏనుగు
Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 3:07 PM IST
పశ్చిమ బెంగాల్‌... లాల్‌ఘర్‌లోని పాగల్పారాలో ఉన్న ధరంపూర్‌లో జరిగిందీ విషాద ఘటన. ఊరి చివర ఓ ఏనుగుకు గున్న ఏనుగు పుట్టింది. అది చూసి స్థానికులు ఎంతో సంతోషపడ్డారు. ఆ పిల్ల ఏనుగుకు పుట్టిన రోజు వేడుకలు చేద్దామని అనుకున్నారు. కాసేపు అక్కడ ఉండి... తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన కాసేపటికే పిల్ల ఏనుగు చనిపోయింది. దాంతో తల్లి... పిల్లను అటూ ఇటూ కదుపుతూ పెద్దగా అరవసాగింది. అది చూసిన ఓ కుర్రాడు... ఆ ఏనుగు దగ్గరకు వెళ్లాడు. అదే సమయంలో ఊరి ప్రజలు కూడా ఆ ఏనుగు ఎందుకు అంత గట్టిగా ఆరుస్తోందా అని తిరిగి ఆ ప్రదేశానికి వెళ్లారు. సరిగ్గా వాళ్లు వెళ్లి చూసే సమయంలో అనూహ్య సంఘటన జరిగింది.

తనకు పుట్టిన ఏనుగు చనిపోయిందన్న కోపంతో ఉన్న తల్లి ఏనుగు... పిచ్చెక్కినదానిలా ప్రవర్తించింది. తనకు దగ్గర్లో ఉన్న కుర్రాణ్ని తొండంతో గట్టిగా కొట్టింది. నేలపై పడిన అతన్ని కాళ్లతో తొక్కింది. ఆ తర్వాత తొండంతో నాలుగుసార్లు కొట్టి... తిరిగి గాల్లోకి ఎగరేసి నేలపై విసిరేసింది. అంతే... ఆ కుర్రాడు అప్పటికప్పుడే ప్రాణాలు కోల్పోయాడు.

ఏనుగుకు పిల్ల పుట్టిందని తెలుసుకొని చూద్దామని బయలుదేరి... అక్కడకు వచ్చిన ఫారెస్ట్ అధికారులు... కుర్రాడి మరణం విషయం తెలిసి షాకయ్యారు. అతన్ని చంపిన ఏనుగును అక్కడి నుంచీ తరలిస్తామని స్థానికులకు తెలిపారు.

 ఇవి కూడా చదవండి :

ఆఫర్ ఇస్తాను... బెడ్‌రూంకి వస్తావా... టాలీవుడ్ సింగర్‌తో ఆ డైరెక్టర్...

రీపోలింగ్ పేరుతో చంద్రగిరి ప్రజల్ని అవమానపరుస్తున్నారు : టీడీపీ ఎంపీ శివప్రసాద్

నేను దళిత యువతిని కాకపోయివుంటే, నన్ను రేప్ చేసేవాళ్లు కాదు : అళ్వార్ బాధితురాలు

మహిళను చంపి... ఆమె కడుపులో పిల్లాణ్ని మాయం చేశారు... ఎందుకంటే...
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...