కూతురి కోరిక తీర్చిన తల్లి... బ్రేక్స్ డాన్స్... వైరల్ వీడియో

Break Dance Video : ఆమె ప్రొఫెషనల్స్‌ డాన్సర్ కాకపోయినా... తానూ డాన్స్ వెయ్యగలననే ఆమెలోని కాన్ఫిడెన్స్... ఆమెతో రకరకాల స్టెప్పులు వేసేలా చేసింది. ఈ డాన్స్ వీడియో అందర్నీ అలరించింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 12:25 PM IST
కూతురి కోరిక తీర్చిన తల్లి... బ్రేక్స్ డాన్స్... వైరల్ వీడియో
కూతురి కోరిక తీర్చిన తల్లి... బ్రేక్స్ డాన్స్... వైరల్ వీడియో (Source - FB - Lo Ko)
Krishna Kumar N | news18-telugu
Updated: September 17, 2019, 12:25 PM IST
డాన్స్ ఎలా వెయ్యాలి? ఏ మ్యూజిక్‌కి ఏ స్టెప్ వెయ్యాలి... అందుకు రూల్సేవీ లేవు. ఎవరు ఎలాగైనా డాన్స్ వెయ్యొచ్చు. అది ఇతరులకు ఎంటర్‌టైమ్‌మెంట్ కలిగించేలా ఉంటే చాలు. ఈ విషయంలో ఆ మహిళ వేసిన డాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన కూతురిని సంతోష పెట్టడానికి ఆమె డాన్స్ వేసింది. దాంతో ఆ చిన్నారి ఖుషీ అయిపోయింది. అమ్మతో కలిసి తనూ అటూ ఇటూ గెంతుతూ ఈ లోకాన్ని మర్చిపోయింది. ఐతే... ఇప్పుడా తల్లి వేసిన డాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలెంట్ ఎవడి అబ్బ సొత్తూ కాదనీ... తలచుకుంటే ప్రతి ఒక్కరూ తమలోని టాలెంట్‌ను బయటకు చూపించగలరని ఆమె నిరూపించింది. అందుకే నెటిజన్లు ఆమె డాన్స్ చూసి... అదరహో అంటున్నారు.

ఈ నిమిషంన్నర ఈ వీడియోలో ఓ హిందీ సాంగ్స్ తెరవెనక వినిపిస్తోంది. ఆ తల్లి వేసిన స్టెప్స్... ప్రొఫెషనల్ డాన్సర్లు వేసినట్లు లేకపోవచ్చు... కానీ... తానూ డాన్స్ వెయ్యగలననే కాన్ఫిడెన్స్ ఆమెతో రకరకాల స్టెప్స్ వేసేలా చేసింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ఈ వీడియో వైరల్ అయ్యింది. 9వేల మందికి పైగా దీనికి లైక్స్ కొట్టారు. 600కు పైగా కామెంట్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...