మన దేశంలోని ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో సాధారణం కంటే సగటున 0.86 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వెల్లడించింది. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీగఢ్ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతాయని హెచ్చరించారు.
ఇంకా శివరాత్రి కూడా రాలేదు. అప్పుడే భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. బయటకు వస్తే ఎండల మంట.. ప్రజలు అప్పుడే చుక్కలు చూస్తున్నారు. మన దగ్గర కొంచెం బెటర్.. కానీ ఉత్తర భారతం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతోంది. మండుతున్న ఎండలతో చెమటలు కక్కుతోంది. ఈ క్రమంలో ప్రజలకు భారత వాతావరణ విభాగం (IMD) ఓ హెచ్చరిక చేసింది. ఈసారి ఎండలు మండిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో సాధారణం కంటే సగటున 0.86 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వెల్లడించింది. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీగఢ్ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతాయని హెచ్చరించారు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో మెర్క్యురీ మార్క్ 40 డిగ్రీలను టచ్ చేసింది. ఉత్తర భారతంలో ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తప్రదేశ్‌లో సాధారణం కంటే 0.46 నుంచి 0.71 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD చెప్పింది.
ఉత్తర, పశ్చిమ, తూర్పు భారత్ ప్రాంతాల్లో ఈసారి వేసవి ముందే వచ్చింది. సాధారణ కంటే మూడు వారాలు ముందే ఎండలు దంచికొడుతున్నాయి. ఐతే దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం ఈసారి కాస్త ఉపశమనం ఉంటుందని తెలిపింది. రుతుపవనాలకు ముందు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని వెల్లడించింది. సాధారణం కంటే 0.57 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని పేర్కొంది.
దక్షిణ భారతంలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉంటాయని ఐఎండీ చెప్పినప్పటికీ.. ఇక్కడ కూడా ఎండల తీవ్రత పెరిగింది. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న వేడి గాలల వల్లే తెలంగాణలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలిపింది. పగటి పూట ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారని వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.