Home /News /national /

MOST OF THE LEADERS BELONGS TO SCHEDULED CASTES TRIBES AND OBCS WILL BE GIVEN CHANCE IN CABINET OF PM MODI THIS TIME AK

Cabinet Reshuffle: రేపే కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. రేసులో ముందున్నది వీళ్లే.. వారికి ప్రాధాన్యత

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా (ఫైల్ ఫోటో)

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా (ఫైల్ ఫోటో)

Cabinet Reshuffle: వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన 24 మంది నేతలను కేబినెట్‌లోకి తీసుకుంటారని తెలుస్తోంది.

    మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. ఇందుకు ముహుర్తాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రేపు సాయంత్రం ఆరు గంటలకు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై పార్టీ పెద్దలతో కసరత్తు చేశారు. వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు పలువురు మంత్రుల పనితీరును కూడా బేరీజు వేసుకుని కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు నేతలకు కేంద్ర కేబినెట్‌లో చోటు దాదాపుగా ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా, అసోం మాజీ సీఎం శర్బానంద సోనోవాల్, అనుప్రియా పటేల్, పశుపతినాథ్ పరాస్, ఆర్సీపీ సింగ్, లలన్ సింగ్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే, నిషిత్ ప్రమాణిక్, శంతను ఠాకూర్, నారాయణస్వామి, కపిల్ పాటిల్ కేబినెట్ రేసులో ముందున్నట్టు తెలుస్తోంది.

    వీరితో పాటు ఇతర నేతల పేర్లను కూడా ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు కేబినెట్ విస్తరణ షెడ్యూల్డ్ కులాలకు చెందిన నాయకులకు ఎక్కువగా ప్రాతినిథ్యం లభించే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన 24 మంది నేతలను కేబినెట్‌లోకి తీసుకుంటారని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ సందర్భంగా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, గతంలో కంటే ఎక్కువగా మహిళలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Cabinet Reshuffle

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు