• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MOST AWAITED ENTRY IN INDIAN POLITICS PRASHANT KISHOR ON PRIYANKAS APPOINTMENT AS

ఎన్నాళ్లో వేచిన ఉదయం...ప్రియాంకపై ప్రశాంత్ ప్రశంసలు..బీజేపీకి షాక్

ఎన్నాళ్లో వేచిన ఉదయం...ప్రియాంకపై ప్రశాంత్ ప్రశంసలు..బీజేపీకి షాక్

ప్రియాంక గాంధీ, ప్రశాంత్ కిశోర్

బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ ప్రస్తుతం ఎన్డీయేలో కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీహార్‌లో జేడీయూ, బీజేపీ మధ్య సీట్ల పంపకం కూడా పూర్తయింది. ఐతే జేడీయూ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని పొగడడాన్ని కమలం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

  • Share this:
    కాంగ్రెస్ రాజకీయాల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సోనియాగాంధీ కూతురు ప్రియాంక గాంధీ ప్రత్యక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె రాజకీయ ప్రవేశంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రియాంక ఎంట్రీ దోహదం చేస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అన్నాచెల్లెలు కలిసి హస్తం పార్టీకి పూర్వ వైభవం తెస్తారని ఢంకాబజాయిస్తున్నారు. ఐతే ఎంత మంది వచ్చినా మోదీని ఢీకొట్టలేరని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రియాంక రాకపై ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ కీలక నేత ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్యంత సుదీర్ఘకాలం ఎదురుచూసిన సందర్భం వచ్చిందంటూ ఆమెపై ప్రశంసలు గుప్పించారు.

    భారత రాజకీయాల్లోనే అత్యంత సుదీర్ఘకాలం ఎదురుచూసిన సందర్భం ఎట్టకేలకు వచ్చేసింది. ప్రియాంక రాజకీయ ప్రవేశం చేసిన సమయం, కచ్చితమైన పాత్ర, స్థానంపై అంతటా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో దూకాలని ఎట్టకేలకు ఆమె నిర్ణయించుకున్నట్లు నాకు అనిపిస్తుంది. ప్రియాంక గాంధీకి నా అభినందనలు. శుభాకాంక్షలు.
    ప్రశాంత్ కిశోర్, జేడీయూ నేత


    గతంలో లోక్‌సభ ఎన్నికలు సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్...గత ఏడాది సెప్టెంబరులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. జేడీయూ పార్టీలో చేరిన కొన్ని రోజులకే ఆయనకు పార్టీలో నెంబర్ 2 స్థానాన్ని కట్టబెట్టారు. ప్రస్తుతం జేడీయూ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రశాంత్ కిశోర్... ప్రియాంక గాంధీపై ప్రశంసలు గుప్పించడం చర్చనీయాంశమైంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ ప్రస్తుతం ఎన్డీయేలో కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీహార్‌లో జేడీయూ, బీజేపీ మధ్య సీట్ల పంపకం కూడా పూర్తయింది. చెరి 17 స్థానాల్లో పోటీచేస్తామని..మిగిలిన 6 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసింది. ఐతే జేడీయూ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని పొగడడాన్ని కమలం శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

    ప్రశాంత్ కిశోర్ గతంలో ఐక్యరాజ్యసమితిలో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేశారు. అనంతరం ఎన్నికల వ్యూహకర్తగా అవతారమెత్తారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్) వ్యవస్థాపక సభ్యుల్లో ప్రశాంత్ కిశోర్ ఒకరు. 2014 ఎన్నికల్లో బీజేపీ వ్యూహకర్తగా పనిచేసి మోడీ విజయంలో కీలక పాత్ర పోషించారు. 2015 బీహార్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి తరపున పనిచేసి సక్సెస్ అయ్యారు. 2017 పంజాబ్ ఎన్నికల్లోనూ కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సలహాదారుగా ఉండి..కాంగ్రెస్ విజయానికి కారణమయ్యారు. ఐతే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ విఫలమయ్యారు. ఏపీలో వైసీపీకి సైతం విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. ఇక గత ఏడాది జేడీయూలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
    First published: