2, 3 రోజుల్లో రైల్వే కౌంటర్లలో టికెట్ బుకింగ్... త్వరలో మరిన్ని రైళ్లు

రైల్వే టికెట్ల బుకింగ్ కౌంటర్లు రెండు, మూడు రోజుల్లో ఓపెన్ అవుతాయని కేంద్ర రైల్వే శాఖమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

news18-telugu
Updated: May 21, 2020, 2:16 PM IST
2, 3 రోజుల్లో రైల్వే కౌంటర్లలో టికెట్ బుకింగ్... త్వరలో మరిన్ని రైళ్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జూన్ 1 నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రైళ్లను నడపాలని నిర్ణయించింది. దీంతోపాటు 2, 3 రోజుల్లో టికెట్ బుకింగ్‌ను కూడా కౌంటర్లలోనే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ‘త్వరలో మరికొన్ని రైళ్లను ప్రకటిస్తాం. భారత దేశంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి మరికొంత సమయం పడుతుంది.’ అని పీయూష్ గోయల్ చెప్పారు. రైల్వే టికెట్ల బుకింగ్ కూడా దేశంలోని 1.7 లక్షల కేంద్రాల్లో జరుగుతుందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఐఆర్‌సీటీసీ ద్వారా మాత్రమే రైల్వే టికెట్లు బుకింగ్ జరుగుతోంది. రైల్వే కౌంటర్లలో జరగడం లేదు. ఇకపై రైల్వే కౌంటర్లలో కూడా టికెట్లు ఇస్తామని చెప్పారు. అయితే, అందుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా మార్చి 25వ తేదీ నుంచి రైల్వే సేవలు నిలిచిపోయాయి. ప్రయాణికుల రైళ్లు మొత్తం నిలిచిపోయాయి. ఆ తర్వాత వలస కూలీల కోసం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను నడిపింది. జూన్ 1 నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 21, 2020, 2:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading