Home /News /national /

MORE THAT 35 MONKEYS POISIONED AND KILLED IN KARNATAKA VILLAGE HERE ARE FULL DETAILS BA

38 కోతులకు విషం పెట్టారు.. గోనెసంచుల్లో పడేసి కొట్టారు... చంపేశారు.. అక్కడితో ఆగకుండా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ దారుణ ఘటనలో 38 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. మరో 20కి పైగా కోతులు గాయపడ్డాయి. వాటికి చికిత్స అందిస్తున్న అటవీ శాఖ సిబ్బంది చనిపోయిన కోతులను ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    మానవత్వానికే మచ్చతెచ్చే ఘటన తాజాగా కర్ణాటకలో వెలుగుచూసింది. మూగజీవాలను అత్యంత దారుణంగా హింసించి చంపిన ఘటన బయటకు వచ్చింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న చౌడనహళ్లి గ్రామంలో జరిగిన ఘటన మానవత్వానికి మాయనిమచ్చగా మారింది. గ్రామానికి వెళ్లే రోడ్డు మీద పెద్ద పెద్ద గోనె సంచులు పడిఉన్నాయి. గ్రామానికి వచ్చే ఓ వ్యక్తి ఆ గోనె సంచులను చూసి ఏదో అనుమానం వచ్చింది. అందులో ఏం ఉన్నాయో చూద్దామని చెక్ చేశాడు. ఆ గోనె సంచుల మీద రక్తం ఉంది. లోపల నుంచి మనిషికి కట్టేసినట్టుగా అది కదులుతున్నట్టుగా ఉంది. దీంతో అతడు భయపడ్డాడు. ఏదో హత్య అనుకున్నాడు. కానీ, ఒకవేళ లోపల వ్యక్తి ప్రాణాలతో ఉంటే.. అతడిని కాపాడిన వాడిని అవుతాననే అభిప్రాయంతో గోనె సంచి ఓపెన్ చేశాడు. అప్పుడు అతడికి నిజమైన షాక్ తగిలింది.

    ఆ గోనె సంచిలో కోతులు ఉన్నాయి. అందులో కొన్ని చనిపోయి ఉన్నాయి. కొన్ని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎప్పుడూ ఎగురుతూ దుముకుతూ కనిపించే కోతులు కనీసం గొంతెత్తి అరుస్తూ అయినా తమ బాధను కూడా చెప్పుకోలేని స్థితిలో కనిపించాయి. అదే సమయంలో అటుగా వస్తున్న కొందరు గ్రామస్తులు మిగిలిన గోనె సంచులను కూడా విప్పి చూశారు. అందులో కూడా వారికి కోతులు కనిపించాయి. అందులో కొన్ని చనిపోయి ఉన్నారు.

    కొన ఊపిరితో కొట్టుకుంటున్న వాటినైనా కాపాడుకునేందుకు గ్రామస్తులు కృషి చేశారు. కొన్ని నీళ్లు తీసుకొచ్చి వాటికి తాగించారు. ఈ లోపు విషయాన్ని అటవీ శాఖ సిబ్బంకి తెలియజేశారు. ఇది ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా అటవీ శాఖ సిబ్బంది తేల్చారు. మొత్తం 38 కోతులు చనిపోయినట్టు తేలింది. వాటికి ‘శవపరీక్షలు’ నిర్వహించగా అందులో కోతులకు విషం పెట్టినట్టు వెల్లడైంది. అంటే.. వాటికి ఆహారంలో విషం పెట్టి.. ఆ తర్వాత వాటిని గోనె సంచుల్లో వేసి కట్టేసి దారుణంగా కొట్టిన తర్వాత ఆ బ్యాగులను తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారనే విషయం తెలిసింది.

    ఈ దారుణ ఘటనలో 38 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. మరో 20కి పైగా కోతులు గాయపడ్డాయి. వాటికి చికిత్స అందిస్తున్న అటవీ శాఖ సిబ్బంది చనిపోయిన కోతులను ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Karnataka, Monkeys

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు