షాకింగ్ న్యూస్.. పాముకాటుతో ఇండియాలో 10 లక్షల మందికి పైగా మృతి..

2001 నుంచి 2014 మధ్యకాలంలో పాము కాటు మరణాలలో 70 శాతం బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో సహా) రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లో సంభవించాయి.

news18-telugu
Updated: July 9, 2020, 3:13 PM IST
షాకింగ్ న్యూస్.. పాముకాటుతో ఇండియాలో 10 లక్షల మందికి పైగా మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారతదేశంలో పాముకాటుతో గత 20 సంవత్సరాల్లో 1.2 మిలియన్ల మంది మృత్యువాత పడ్డారు. ఇటీవల చేసిన ఒక కొత్త అధ్యయనంలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల్లో దాదాపు సగం మంది 30 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్సువారు ఉండగా, నాలుగింట ఒక వంతు పిల్లలు ఉన్నారని అధ్యయనంలోతేలింది. అయితే రస్సెల్ వైపర్స్, క్రైట్స్, కోబ్రాస్ జాతులకు చెందిన పాములతోనే చాలామంది మరణించారు. 12 ఇతర జాతుల పాముల వల్ల మిగిలిన మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు చాలా వరకు వైద్యం అందని మారుమూల ప్రాంతాల్లోనే జరిగినట్టు అధ్యయనంలో పేర్కొన్నారు. సాధారణంగా వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. అందులో భాగంగానే జూన్ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో పాముకాటుతో అధిక శాతం మంది మరణించారు.

ఈ విషయాలను భారతీయ, అంతర్జాతీయ నిపుణులు చేసిన మిలియన్ డెత్ స్టడీ అనే అధ్యయనం నుంచి ఓపెన్ యాక్సెస్ జర్నల్ ఈలైప్‌లో ప్రచురించిన అధ్యయనంలో ఈ మేరకు వివరాలను పేర్కొన్నారు. రస్సెల్ వైపర్ అనే పాము సాధారణంగా దూకుడుగా ఉంటుంది. ఇండియాతో పాటు దక్షిణ ఆసియా అంతటా ఎక్కువగా వీటి సంచారం ఉంది. ఇది ఎలుకలను ఆహారంగా తింటుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల మధ్య తరచూ కన్పిస్తుంది. భారతీయ క్రైట్ జాతి పాములు సాధారణంగా పగటిపూట నిశ్శబ్దంగా ఉండి.. రాత్రిసమయంలో సంచరిస్తుంటుంది. భారతీయ కోబ్రా సాధారణంగా చీకటి పడిన తర్వాత దాడి చేస్తుంది. ఇది కాటు వేస్తే తక్షణ వైద్య సాయం అందాలి.

లేకపోతే బతకడం కష్టమవుతుంది. ఇదిలావుంటే.. 2001 నుంచి 2014 మధ్యకాలంలో పాము కాటు మరణాలలో 70 శాతం బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ (తెలంగాణతో సహా) రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లో సంభవించాయి. వర్షాకాలంలో గ్రామాల్లో నివసించే రైతులు పాము కాటుకు ఎక్కువగా గురవుతున్నారని అధ్యయనం చేసిన పరిశోధకులు తెలిపారు. అయితే పాములు ఎక్కువగా కాళ్ల భాగంలో కరిచినట్టు పరిశోధనలో తేటతెల్లమయ్యింది.

దీంతో రబ్బరు బూట్లు, చేతి తోడుగులను ధరించడం, టార్చ్ లైట్లను ఉపయోగించడం, పాము కాటు వేయగానే సురక్షిత పద్ధతుల్లో పాము కరిచిన చోట కోసి రక్తం బయటకు వెళ్లేలా చేయడం వంటి పద్ధతుల ద్వారా పాము కాటు నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 81 వేల నుంచి 1,38,000 మంది మధ్య పాము కాటుతో మరణిస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 9, 2020, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading